TS: బ్లాక్‌ ఫంగస్‌తో ఎక్సైజ్‌ ఎస్‌ఐ మృతి | Excise SI Died Due To Black Fungus In Khammam | Sakshi
Sakshi News home page

TS: బ్లాక్‌ ఫంగస్‌తో ఎక్సైజ్‌ ఎస్‌ఐ మృతి

Jul 5 2021 1:03 PM | Updated on Jul 5 2021 1:25 PM

Excise SI Died Due To Black Fungus In Khammam - Sakshi

ఎస్సై ఎం.చిరంజీవి

సాక్షి,ఖమ్మం: స్థానిక ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని ఎస్సైగా పనిచేస్తున్న ఎం.చిరంజీవి (55) బ్లాక్‌ ఫంగస్‌తో ఆదివారం మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. నేలకొండపల్లి ఎక్సైజ్‌ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న చిరంజీవికి నెల రోజుల కిందట కరోనా సోకింది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స కోసం తరలించారు. అక్కడ కరోనా నెగటివ్‌ వచ్చాక బ్లాక్‌ ఫంగస్‌ సోకింది.

అదే హస్పిటల్‌లో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్న సందర్భంలో మళ్లీ అనారోగ్యం బారిన పడి ఆదివారం మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. నేలకొండపల్లి ఎక్సైజ్‌ సీఐ విజేందర్, ట్రైనింగ్‌ ఎస్సైలు శంకర్, సందీప్, నేలకొండపల్లి, కొత్తకొత్తూరు సర్పంచ్‌లు రాయపూడి నవీన్, వల్లాల రాధాకృష్ణ, రాచమంద్రాపురం సొసైటీ చైర్మన్‌ గూడవల్లి రాంబ్రహ్మం, దగ్గుల అంజిరెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు

Advertisement
 
Advertisement
Advertisement