19న దేవన్నపేట పంప్‌హౌస్‌ ప్రారంభం | Devannapet pump house to be launched on 19th: Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

19న దేవన్నపేట పంప్‌హౌస్‌ ప్రారంభం

Mar 18 2025 2:09 AM | Updated on Mar 18 2025 2:09 AM

Devannapet pump house to be launched on 19th: Uttam Kumar Reddy

ఒక మోటార్‌ను ఆన్‌ చేయనున్న మంత్రి ఉత్తమ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేవాదుల ఎత్తిపోతల పథకం మూడో దశ లో భాగంగా దేవన్న పేటలో పంప్‌హౌస్‌ నిర్మించారు. ఆపంప్‌హౌస్‌లోని ఒక మోటార్‌ను రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఆన్‌ చేసి యాసంగి పంటలకు నీటిని విడుదల చేయనున్నారు. మూడు మోటార్లు పంప్‌హౌస్‌లో ఉండగా, ఒక్కో మోటార్‌ 600 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేవాదుల ప్రాజెక్టు నిర్వహణ, పర్యవేక్షణ పనులు చూసే కాంట్రాక్టర్‌కు పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో అక్కడ పనిచేసే సిబ్బంది జీతాల కోసం 24 రోజులపాటు సమ్మె నిర్వహించారు.

దీంతో అప్పట్లో దేవాదుల ప్రాజెక్టు కింద రిజ ర్వాయర్లకు నీటి పంపింగ్‌ నిలిచిపోయింది. ప్రస్తుతం సమ్మక్కసాగర్‌ నుంచి దేవాదుల ప్రాజెక్టు కింద నీటిని ఎత్తిపోస్తుండగా, సమ్మక్కసాగర్‌లో 2.5 టీఎంసీల నిల్వలు మిగి లాయి. రోజూ 1,500 క్యూసెక్కుల ప్రవాహం సమ్మక్కసాగర్‌కు వస్తోంది. దేవన్నపేటలోని మూడు మోటార్లను సిద్ధం చేస్తే రోజూ 1,600 క్యూసెక్కులను ఎత్తిపోసేందుకు అవకాశం ఉంటుంది. దేవాదుల ప్రాజెక్టు కింద 5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, యాసంగిలో 1.9 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement