తెలంగాణలో రసవత్తరంగా రాజకీయం.. కవిత లేఖకి ఈడీ రిప్లై! | Delhi Liquor Scam: Ed Accepts Mlc Kavitha Request On Delay Enquiry | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రసవత్తరంగా రాజకీయం.. కవిత లేఖకి ఈడీ రిప్లై!

Mar 8 2023 8:03 PM | Updated on Mar 8 2023 9:42 PM

Delhi Liquor Scam: Ed Accepts Mlc Kavitha Request On Delay Enquiry - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు కారణంగా తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే ఈ కేసులో స్పీడ్‌ పెంచిన ఈడీ విచారణకు హాజరు కావాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. అయితే బిజీ షెడ్యూల్‌ కారణంగా విచారణకు హాజరుకాలేనని ఆమె ఈడీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈనెల 15న హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. 

ఈ పరిణామాల మధ్య బుధవారం సాయంత్రం కవిత ఢిల్లీకి పయనమయ్యారు. ఇదిలా ఉండగా కవిత విజ్ఞప్తిని ఈడీ పరిగణలోకి తీసుకుంది. మార్చి 9న కవిత ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ నెల 11న కవితను ఈడీ విచారణకు పిలిచే అవకాశముంది.

తెలంగాణ కేబినెట్‌ భేటీ
మరో వైపు గురువారం (మార్చి 9) తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో కేసీఆర్ చర్చించనున్నారన్నారు. వీటితో పాటుగా ఒక వేళ ఈడీ కవితను అరెస్టు చేస్తే ఏం చేయాలనే విషయంపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం.

ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు విషయంగా ఈడీ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో తదుపరి కార్యచరణపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. విపక్షాలను నిలువరించేందుకు, నాయకులను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేంద్ర వ్యవస్థలైన సీబీఐ, ఈడీ, ఐటీలను బీజేపీ వాడుకుంటోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement