25 వరకు దోస్త్‌ రెండో దశ రిజిస్ట్రేషన్లు | Degree Online Services Telangana Second Stage Options Until 25/10/2020 | Sakshi
Sakshi News home page

25 వరకు దోస్త్‌ రెండో దశ రిజిస్ట్రేషన్లు

Sep 22 2020 4:06 AM | Updated on Sep 22 2020 4:06 AM

Degree Online Services Telangana Second Stage Options Until 25/10/2020 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో సీట్ల కేటాయింపునకు డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ(దోస్త్‌) రెండో దశ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే మొదటి దశ సీట్ల కేటాయింపు పూర్తవడంతో తాజాగా తదుపరి దశల షెడ్యూల్‌ విడుదల చేసింది. దీని ప్రకారం రెండో దశలో ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం సోమవారం నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించినట్లు దోస్త్‌ కన్వీనర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు. ఇది ఈ నెల 25వరకు కొనసాగుతుందన్నారు. అలాగే ఈనెల 26 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకో వచ్చని పేర్కొన్నారు. ఇక మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు సోమవారం నుంచే ఆన్‌లైన్‌ ద్వారా నిర్దేశిత కాలేజీ/సీటు రిజర్వేషన్‌ ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో ఈ నెల 26వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలన్నారు. ప్రస్తుతం కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదని, వీరికి తరగతులు ఎప్పుడు ప్రారంభించేదీ తరువాత తెలియజేస్తామని వెల్లడించారు. 

ఇదీ రెండు, మూడు దశల ప్రవేశాల షెడ్యూలు..
25–9–2020 వరకు: రెండో దశ రిజిస్ట్రేషన్లు
26–9–2020 వరకు: రెండో దశ వెబ్‌ ఆప్షన్లు
25–9–2020: స్పెషల్‌ కేటగిరీ వారికి వర్సిటీ హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ 
1–10–2020: రెండో దశ సీట్లు కేటాయింపు
1–10–2020 నుంచి 6–10–2020 వరకు: ఆన్‌లైన్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
1–10–2020 నుంచి 5–10–2020 వరకు: మూడో దశ రిజిస్ట్రేషన్లు
1–10–2020 నుంచి 6–10–2020 వరకు: మూడో దశ వెబ్‌ ఆప్షన్లు
5–10–2020: స్పెషల్‌ కేటగిరీ వారికి వర్సిటీ హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌
10–10–2020: మూడో దశ సీట్లు కేటాయింపు
10–10–2020 నుంచి 15–10–2020 వరకు: ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్, మూడు దశల్లో సీట్లు పొంది, సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసిన వారు కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement