యువతిని ప్రేమిస్తున్నాడని యువకుడిని కొట్టి చంపారు | Dalit Youth death Over Love Affair in Jagtial | Sakshi
Sakshi News home page

యువతిని ప్రేమిస్తున్నాడని యువకుడిని కొట్టి చంపారు

Sep 28 2025 5:55 AM | Updated on Sep 28 2025 5:55 AM

Dalit Youth death Over Love Affair in Jagtial

సారంగాపూర్‌: జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం రేచపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన ఎదురుగట్ల సతీశ్‌ (29) అదే కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమి­స్తున్నానని, ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ రావొద్దని సోషల్‌ మీడి­యాలో పోస్ట్‌ చేశాడు.

ఈ విషయంపై యువతి కుటుంబ సభ్యులు సతీశ్‌ను పలుమార్లు వారించారు. అయినా అతడిలో మార్పు రాలేదు. ఈ క్రమంలో శనివారం రాత్రి 8గంటలకు సతీశ్‌కు, యువతి కుటుంబ సభ్యులకు గొడవ జరిగింది. యువతి కుటుంబ సభ్యులు కర్రలతో సతీష్‌పై దాడి చేయగా, మృతిచెందాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement