సీటీ స్కాన్‌ అదనపు వసూళ్లపై మంత్రి హరీశ్‌ ఆగ్రహం

For Ct Scan Take Two Thousand Only Order By Telangana Minister Harish Rao - Sakshi

టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం

మెదక్‌ జోన్‌: కరోనా నిర్ధారణ పరీక్షల నిమిత్తం సీటీస్కాన్‌ నిర్వాహణ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే అనుమతులు ఇవ్వాలని, సీటీస్కాన్‌కు రూ.5 వేల వరకు వసూలు చేస్తునట్లు తన దృష్టికి వచ్చిందని కేవలం రూ.2 వేలు మాత్రమే తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు  సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

ప్రస్తుతం జిల్లాలో 3 మాత్రమే సీటీస్కాన్లు ఉన్నాయని అందులో 2 మెదక్‌లో ఉండగా 1 మాత్రమే తూప్రాన్‌లో ఉందని చెప్పారు. కొత్తగా ఎవరు సీటీస్కాన్‌ నిర్వహణకు అనుమతి అడిగినా వారికి ఇవ్వాలని చెప్పారు. అలాగే జిల్లాలో కోవిడ్‌ పరిస్థితి ఏ విధంగా ఉందని, వ్యాక్సిన్, ఆక్సిజన్, లాక్‌డౌన్‌ తదితర అంశాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌తో పాటు వైద్యాధికారులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్‌ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

చదవండి: కరోనా వ్యాక్సిన్‌: టీకా వేయించుకుంటే రూ.7 కోట్లు మీవే..
చదవండి: కంగారొద్దు: తెలంగాణలో రెమిడిసివిర్‌ కొరత లేదు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top