ఆర్కే 5బి గనిలో పేలుడు 

Coal Mine Roof Collapse In Mancherial - Sakshi

ఒకరు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు 

వైద్యుల నిర్లక్ష్యంపై కార్మిక సంఘాల ఆగ్రహం

సాక్షి, శ్రీరాంపూర్‌: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ డివిజన్‌లోని ఆర్కే 5బి గనిలో బుధవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వివరాలు.. రోజువారీ పనుల్లో భాగంగా కోల్‌ కట్టర్లు రత్నం లింగయ్య, పల్లె రాజయ్య, గాదె శివయ్య, బదిలీ వర్కర్‌ సుమన్‌కుమార్, షాట్‌ ఫైరర్‌ శ్రీకాంత్‌ విధులకు హాజరయ్యారు. రెండో షిఫ్ట్‌ విధుల్లో భాగంగా వీరికి భూగర్భంలో కోల్‌æకట్టింగ్‌ పనులు అప్పగించారు. వారు బ్లాస్టింగ్‌ హో ల్స్‌ చేస్తుండగా.. ఒక్కసారి పేలుడు సంభవించింది. బొగ్గు పొరల్లో ఉన్న మందుగుండు పేలడంతో పొరల్ని చీల్చుకుంటూ వచ్చిన పెల్లలు.. కార్మికుల చేతులు, ముఖాలకు బలంగా తాకాయి. ఈ ప్రమాదంలో రత్నం లింగయ్య తల, చేతులకు, శివయ్య ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వా రూ గాయపడ్డారు. క్షతగాత్రులను తోటి కార్మికులు ఉపరితలానికి తీసుకొచ్చి.. అక్కడి నుంచి రామకృష్ణాపూర్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. (వరంగల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం )

అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో రత్నం లింగయ్య మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని అదే అంబులెన్సులో తిరిగి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. లింగయ్యకు ఆసుపత్రిలో కనీస ప్రాథమిక చికిత్స చేయకుండానే హైదరాబాద్‌కు రెఫర్‌ చేయడంతోనే మృతి చెందాడని కార్మిక సం ఘాల నేతలు, కార్మికులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీసైదా, బీఎంఎస్‌ కేంద్ర ఉపాధ్యక్షుడు పేరం రమేశ్‌ వైద్య అధికారులను నిలదీశారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర కమిటీ నాయ కులు ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.వీరభద్రయ్య ఏరియా ఆసుపత్రి వద్ద మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

మొదటి షిఫ్ట్‌లో బ్లాస్ట్‌ కానిదే.. 
ప్రమాదానికి మొదటి షిఫ్ట్‌లో బ్లాస్టింగ్‌ కాకుండా మిగిలిన మందుగుండే కారణమని, మొదటి షిఫ్ట్‌లో పేలకుండా.. రెండో షిఫ్ట్‌లో పేలిందని తెలిసింది. సాధారణంగా బ్లాస్టింగ్‌ జరిగిన తర్వాత ఎన్ని మందుగుండ్లు పెట్టారు..? ఎన్ని పేలాయి..? పేలనివి ఎన్ని..? అని లెక్క చేసుకుంటారు. పేలనివి ఉంటే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ మొదటి షిఫ్ట్‌లో పేలని దాన్ని గుర్తించకుండా అధికారులు రెండో షిఫ్ట్‌లో కార్మికులను పనులకు పంపడంతో ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top