సిద్దిపేటపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు | CM KCR Announces RS 100 Crore For Ranganayasagr Development | Sakshi
Sakshi News home page

సిద్దిపేటపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు

Dec 10 2020 4:57 PM | Updated on Dec 10 2020 9:02 PM

CM KCR Announces RS 100 Crore For Ranganayasagr Development - Sakshi

సాక్షి, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. సిద్దిపేట పర్యటనలో భాగంగా గురువారం ఆయన మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి రూ.45 కోట్లతో సిద్ధిపేట శివారులో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. ఆనంతరం జిల్లాలోని గవర్నమెంట్‌ కాలేజీలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. జిల్లాకు మరో వెయ్యి డబుల్‌ బెడ్రూం ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే జిల్లాలోని రంగనాయకసాగర్‌ పర్యాటక అభివృద్దికి 100 కోట్ల రూపాయాలను ప్రకటించారు. ఇరుకోడు లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు రూ.80 కోట్లు, సిద్దిపేటలో వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌కు రూ.25 కోట్లు మంజూరు చేశారు. అలాగే 160 కోట్లతో రాజీవ్‌ రహదారిని విస్తరిస్తామని హామీ ఇచ్చారు. నెలలోపు సిద్దిపేటలో బస్తీ దవఖానాను ఏర్పాటు చేస్తామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement