గణేష్ నిమజ్జనం: బ్యాండ్‌ లేకపోతేనేం.. చిన్నారుల ఆలోచన అదిరిపోయింది

Childrens Did Variety Ganesh Immersion In Nirmal District - Sakshi

సాక్షి, నిర్మల్‌: గణేష్‌ పండగంటేనే ఉత్సాహం, ఊరేగింపు. వినాయక మండపాలు, భారీ సెట్టింగులు, వీధికో వినాయకుడు, పెద్దఎత్తున పూజలు ఇలా ప్రతీదిగా సందడిగా ఉంటుంది. ఇక, నవరాత్రుల చివరి రోజున నిర్వహించే శోభాయాత్ర అయితే ఇక మామూలుగా ఉండదు. కిలోమీటర్ల మేర బారులు తీరిన గణనాథులను చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవు.  బ్యాండ్‌లు, డీజేలతో జరిగే వినాయకుడి ఊరేగింపు కన్నుల పండుగగా కనిపిస్తుంది.
చదవండి: వినాయక నిమజ్జనంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం

తాజాగా ఓచోట గణేష్‌ ఊరేగింపులో వారికి బ్యాండ్‌లు దోరకలేదు. అయితేనేం ఏమాత్రం నిరుత్సాహ పడని యువకులు, చిన్నారులు వినూత్న ఆలోచన చేశారు. నూనె పీపాలను బ్యాండ్ వాయిద్యాలుగా మార్చారు. నూనె పీపాల వాయిద్యాలు మోత మోగుతుంటే తీన్మార్  డాన్స్‌లు  చేస్తూ  గణేష్ నిమజ్జనం శోభ యాత్ర ముందుకు సాగించారు. ఈ విచిత్ర ఘటన  నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిర్పేల్లి  గ్రామంలో చోటుచేసుకుంది. 

వినాయక నిమజ్జనం కోసం పిల్లలు బ్యాండ్  అద్దే ప్రయత్నించారు. కానీ బ్యాండ్ అద్దె దొరకలేదు. దీంతో నూనె పీపాల వాయిద్యాలతో, ఎండ్ల బండి రథంపై వినాయకుని శోభ యాత్ర గ్రామంలోని వీధుల గుండా  సాగించారు. ఈ వైరైటీ ‌నిమజ్జనం తిలకించడానికి గ్రామస్తులు భారీగా  తరలివస్తున్నారు.  పైగా  విన్నూతన అలోచనతో  నిమజ్జనం చేస్తున్న పిల్లలను శభాష్‌ అంటూ పలువురు అభినందిస్తున్నారు.
చదవండి: వేయలేక.. వదల్లేక.. భక్తులకు నిమజ్జనం టెన్షన్‌!

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top