‘బంగారాలూ.. వారంలో వచ్చేస్తాం’ అంతలోనే...

Children Losing Their Parents Due To Coronavirus - Sakshi

 ఇద్దరు పిల్లలకు జాగ్రత్తలు చెప్పారు

తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు

 దంపతుల్ని బలి తీసుకున్న కరోనా మహమ్మారి

ముత్తారం(మంథని): ‘బంగారాలు.. నానమ్మ, తాతయ్యల దగ్గర ఉండండి. అల్లరి చేయొద్దు. బయట తిరగొద్దు.. ’అంటూ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలకు ఆ తల్లి జాగ్రత్తలు చెప్పింది.  మారాం చేస్తున్న కొడుకులిద్దరినీ.. ‘వారం రోజుల్లో తిరిగి వస్తాం. అందరం కలిసి మనింటికి వెళ్లిపోదాం..’ అంటూ బుజ్జగించింది.  అప్పట్నుంచీ తల్లిదండ్రుల కోసం పిల్లలు ఆశగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

వారం గడిచినా రాలేదు. కరోనా కాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి తర్వాత మరొకరు 12 గంటల వ్యవధిలోనే ఇద్దరూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తల్లిదండ్రులిద్దరూ విగతజీవులై రావడం చూసిన చిన్నారులు కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కరోజులోనే దంపతులు మరణించడం, పెద్ద కొడుకైన 11 ఏళ్ల బాలుడు తన ఏడేళ్ల తమ్ముణ్ణి ఓదార్చడం స్థానికుల్ని కంటతడి పెట్టించింది.

తొలుత భర్తకు..
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటకు చెందిన కుడికల్ల మల్లేశ్‌ (36), సృజన (34) దంపతులు.. ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ గ్రామంలో మెడికల్‌ షాపు నడుపుతున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవల కోవిడ్‌ లక్షణాలతో చాలామంది మల్లేశ్‌ వద్దకు వచ్చి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం అతడికి జ్వరం వచ్చింది. రెండు రోజులు మందులు వాడినా తగ్గకపోవడంతో భార్య ఒత్తిడితో గోదావరిఖనిలో హెచ్‌ఆర్‌సీటీ స్కాన్‌ చేయించుకున్నాడు. అందులో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో దంపతులిద్దరూ బేగంపేటకు వెళ్లి పిల్లల్ని నాన్నమ్మ, తాతయ్య దగ్గర విడిచి పెట్టారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన మల్లేశ్‌ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరాడు.

తర్వాత భార్యకు కూడా..
కరీంనగర్‌లో ఆస్పత్రి బయట ఉంటూ భర్త బాగోగులు చూసుకుంటున్న సృజన కూడా నాలుగురోజుల తర్వాత అస్వస్థతకు గురయ్యింది. అదే ఆస్పత్రిలో టెస్ట్‌ చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆమె కూడా అదే ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరింది. బుధవారం వరకు చికిత్స కోసం మల్లేశ్‌కు రూ.8 లక్షలు, సృజనకు రూ.2 లక్షలు మొత్తం రూ.10 లక్షలు ఖర్చుపెట్టినా వారి ప్రాణాలు దక్కలేదు. మెడికల్‌ షాపుతో ఉపాధి పొందుతున్న వీరికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. అయినా వారి చికిత్స కోసం కుటుంబసభ్యులు.. బంధువుల సాయంతో అప్పు చేసి రూ.10 లక్షల వరకు ఆస్పత్రికి చెల్లించారు.

కానీ ఆరోగ్యం విషమించడంతో బుధవారం మధ్యాహ్నం 3.30 సమయంలో మల్లేశ్‌ మృతి చెందాడు. ఈ విషయం సృజనకు తెలియనివ్వకుండా.. కుటుంబసభ్యులు అదేరోజు మృతదేహాన్ని బేగంపేటకు తీసుకొచ్చి రాత్రికల్లా అంత్యక్రియలు పూర్తిచేశారు. మల్లేశ్‌ దహన సంస్కారాలు ముగించి 12 గంటలు కూడా గడవకముందే సృజన కూడా ఆరోగ్యం విషమించి మరణించినట్టు ఆస్పత్రి నుంచి గురువారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో కుటుంబసభ్యులకు ఫోన్‌ వచ్చింది. దీంతో కుటుంబసభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. బంధువులు మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని కూడా బేగంపేటకు తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. తల్లిదండ్రులిద్దర్నీ కోల్పోయిన పిల్లల్ని చూసి నాన్నమ్మ, తాతయ్య గుండెలవిసేలా రోదిస్తున్నారు.

ఎలాగైనా బతికించుకోవాలనుకుని..
మల్లేశ్‌ దంపతులు కరీంనగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో.. మల్లేశ్‌ తమ్ముడు సది, సృజన సోదరుడు కృష్ణ తమ అన్న, అక్కను ఎలాగైనా బతికించుకోవాలని భావించారు. ఏపీలోని కృష్ణపట్నం ఆనందయ్య మందు పని చేస్తోందని విని దాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. బెంగళూరులోని ప్రైవేట్‌ కంపెనీలో పనిచేసే కృష్ణ.. తనతో పాటుగా పనిచేసే పరిచయస్తులైన కృష్ణపట్నం వాసుల సహాయంతో ఆనందయ్య మందు కోసం ప్రయ త్నించాడు.

వారు మందు తెస్తున్నామని చెప్పడంతో బుధవారం ఉదయం సది, కృష్ణ ఇద్దరూ అంబులెన్స్‌ మాట్లాడుకొని ఆంధ్రా సరిహద్దుకు వెళ్లారు. మందు తీసుకుని తిరిగి కరీంనగర్‌కు బయల్దేరారు. ఆనందయ్య మందు దొరికిందన్న వారి ఆనందం అంతలోనే ఆవిరైంది. సరిహద్దు నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే మల్లేశ్‌ మృతిచెందిన వార్తను కుటుంబసభ్యులు వారికి ఫోన్‌ చేసి చెప్పారు. ఆ విషాదంలోనే వారు గురువారం తెల్లవారుజా మున 4.30కి కరీంనగర్‌ చేరుకున్నారు. అయితే అప్పటికి గంట క్రితమే సృజన కూడా చనిపోయిందని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో ఇద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

28-05-2021
May 28, 2021, 08:33 IST
డబ్బు సాయం చేయకపోతే చచ్చిపోతామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఆమె వాపోయింది. ఇలాంటి మెసేజ్‌లు చేస్తే..
28-05-2021
May 28, 2021, 05:04 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత రెండు వారాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. చాలా జిల్లాల్లో కేసుల ప్రభావం...
28-05-2021
May 28, 2021, 04:42 IST
మొదటి డోస్‌ కోవాగ్జిన్‌ తీసుకున్నాం. నాలుగు వారాల తర్వాత రెండో డోస్‌ తీసుకోవాలి. కానీ కోవాగ్జిన్‌ స్టాక్‌ లేదు. నిర్ణీత...
28-05-2021
May 28, 2021, 04:07 IST
సాక్షి, అమరావతి: ఆయుర్వేద వైద్యుడు బొనిగి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధం పంపిణీ విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీ...
28-05-2021
May 28, 2021, 03:40 IST
పంజగుట్ట(హైదరాబాద్‌): ‘మా పేషెంట్‌కు ఏం వైద్యం చేశారు.. మందులేం వాడారు? మొన్నటి వరకు ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి.. శవాన్ని...
28-05-2021
May 28, 2021, 03:22 IST
వాషింగ్టన్‌: కరోనా పుట్టుకను కనుగొనే ప్రయత్నాలను వేగవంతం చేసి, 90 రోజుల్లోగా పూర్తి నివేదిక అందించాలని అమెరికా అధ్యక్షుడు  బైడెన్‌...
28-05-2021
May 28, 2021, 03:21 IST
సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ చికిత్సలో బ్రహ్మాస్త్రం లాంటి మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ మందును అవసరమున్న వారికే ఉపయోగించాలి తప్ప విచక్షణరహితంగా వాడొద్దని...
28-05-2021
May 28, 2021, 02:58 IST
లండన్‌: కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్‌–2021ను ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ముగిసిన తర్వాత కొనసాగించాలని బీసీసీఐ భావిస్తుండగా... తమ...
28-05-2021
May 28, 2021, 02:43 IST
ఎస్‌ఎస్‌ తాడ్వాయి: వారు అభం, శుభం తెలియని చిన్నారులు.. ఒకరి వయసు ఐదేళ్లు, మరొకరికి మూడేళ్లు. పదహారు రోజుల వ్యవధిలోనే...
27-05-2021
May 27, 2021, 18:42 IST
లక్నో: భారతీయులకు వేదకాలం నుంచి గంగానదితో అనుబంధం పెనువేసుకుపోయింది. హిందువులు గంగానదిని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. గంగాజలాన్ని చల్లుకుంటే పునీతులవుతారనేది ప్రధాన...
27-05-2021
May 27, 2021, 18:05 IST
హైదరాబాద్‌: ఓ వైపు కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. మరోవైపు ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీ కూడా అదే రేంజ్‌లో ఉంది. అయితే ప్రభుత్వ...
27-05-2021
May 27, 2021, 14:35 IST
అచ్చు మా అమ్మలాంటి ఒకామె నా ఆటోలో కూచుని ఆక్సిజన్‌ పొంది బెడ్‌ కన్ఫర్మ్‌ అయ్యాక హాస్పిటల్‌లోకి వెళ్లింది
27-05-2021
May 27, 2021, 06:09 IST
కరోనాపై యుద్ధాన్ని గెలవడానికి, కోవిడ్‌ 19 నుంచి ప్రాణాలను రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం టీకా అని ప్రధాని మోదీ...
27-05-2021
May 27, 2021, 06:02 IST
దేశంలో రోజువారీ కొత్త కరోనా పాజిటివ్‌ కేసుల్లో కాస్త తగ్గుదల కనిపిస్తున్నా.. రోజువారీ మరణాల సంఖ్యలో తగ్గుదల కనిపించట్లేదు.
27-05-2021
May 27, 2021, 05:36 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)...
27-05-2021
May 27, 2021, 04:59 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా కోవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో...
27-05-2021
May 27, 2021, 04:34 IST
కాకినాడ సిటీ: కరోనా కారణంగా తల్లిదండ్రులు మరణించిన చిన్నారుల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసే కార్యక్రమం తూర్పు...
27-05-2021
May 27, 2021, 04:11 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సీఎం సహాయనిధికి కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.2 కోట్ల విరాళం ఇచ్చింది....
27-05-2021
May 27, 2021, 03:01 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌ విపత్తు వేళ డాక్టర్లు, వైద్య సిబ్బంది నిర్విరామంగా అందిస్తున్నసేవలకు ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
27-05-2021
May 27, 2021, 02:51 IST
నా నుంచి మీదాకా.. ఒకటే ‘‘రెండో డోస్‌ టీకా కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తాం. వ్యాక్సిన్‌ విషయంలో నా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top