డిస్క్ంకు ఉరితాళ్లు! | Sakshi
Sakshi News home page

డిస్క్ంకు ఉరితాళ్లు!

Published Tue, Jul 19 2022 7:16 AM

Cable Wires Wrapped Around Electric Poles - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో వీధుల్లో లాగుతున్న వివిధ రకాల కేబుల్‌ వైర్లు (ఇంటర్నెట్, డిష్‌)విద్యుత్‌ స్తంభాలకు పెద్ద గుదిబండలా మారాయి. కోర్‌సిటీతోపాటు శివారు మున్సిపాలిటీల్లోనూ విద్యుత్‌ స్తంభాలు వివిధ రకాల కేబుల్‌ వైర్లతో సాలెగూళ్లను తలపిస్తున్నాయి. ఒక విద్యుత్‌ స్తంభానికి మరో విద్యుత్‌ స్తంభానికి మధ్య మైనస్‌ (ఎర్త్‌), ప్లస్‌ (పవర్‌ సప్లయ్‌)తో పాటు త్రీ ఫేజ్‌ (ఎల్టీ) వైర్లు మాత్రమే ఉండాల్సిఉండగా 40 నుంచి 50 కేబుల్‌ వైర్లు వేలాడుతున్నాయి. ఈదురు గాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి తీగలపై పడుతున్నాయి.

సాధారణంగా రెండు మూడు వైర్లు మాత్రమే ఉంటే చెట్ల బరువుకు తీగలు తెగి, నష్టం కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అంతకు మించి కేబుళ్లు వేలాడుతున్నాయి. భారీ చెట్లు, కొమ్మలు విరిగి ఈ లైన్లపై పడ్డప్పుడు ఆ బరువుకు అటు ఇటుగా ఉన్న విద్యుత్‌ స్తంభాలు ఒరుగుతున్నాయి. ఫలితంగా సంస్థకు భారీగా ఆరి్థక నష్టం వాటిల్లడంతో పాటు విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

అంతేకాదు పునరుద్ధరణకు 12 నుంచి 24 గంటల సమయం పడుతోంది. దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారిక లెక్కల ప్రకారం ఈ నెల 8 నుంచి 13 వరకు హైదరాబాద్, రంగారెడ్డి జోన్ల పరిధిలో 2,153 ఫీడర్లు ట్రిప్పవగా, 361 విద్యుత్‌ స్తంభాలు నేలకూలాయి. మరో 31 డి్రస్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడానికి ఈ కేబుళ్లే ప్రధాన కారణమని ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.  

జంక్షన్‌ బాక్సులు..గుట్టుగా కనెక్షన్లు 

  • విపత్తులను తట్టుకుని నిలబడాల్సిన విద్యుత్‌ స్తంభాలు కేబుళ్ల కారణంగా అడ్డంగా విరిగిపడుతున్నాయి.  
  • స్తంభాలు ఎవరైనా ఎక్కాలన్నా..వీధి చివరిలోని డి్రస్టిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాత్కాలికంగా బంద్‌ చేయాలన్నా డిస్కం అనుమతి తప్పని సరి. కానీ ఇంటర్నెట్, కేబుల్‌ సిబ్బంది ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టం వచ్చినట్లు కరెంట్‌ సరఫరా నిలిపివేస్తున్నారు.  
  • ఆయా స్తంభాలకు ఏర్పాటు చేసిన జంక్షన్‌ బాక్సులకు పోల్స్‌పై నుంచి గుట్టుగా సర్వీసు వైర్‌ను లాగి కరెంట్‌ను వాడుతున్నారు. యధేచ్ఛగా విద్యుత్‌ చౌర్యానికి పాల్పడుతున్నాయి.  
  • గ్రేటర్‌లో ఈ తరహా కనెక్షన్లు 60 వేల వరకు ఉన్నట్లు అంచనా. విద్యుత్‌ చౌర్యం వల్ల సంస్థకు వస్తున్న ఈ నష్టాలను క్షేత్రస్థాయి సిబ్బంది లైన్‌లాస్‌ జాబితాలో వేసి చేతులు దులుపుకుంటుండటం గమనార్హం.    

ప్రాణాలు కోల్పోతున్న కార్మికులు 
విద్యుత్‌ స్తంభాల తయారీలో నాణ్యత లోపం స్పష్టంగా కన్పిస్తుంది. సిమెంట్, ఇసుక, ఐరన్‌ కూడా సరిగా వాడటం లేదు. పాతిన కొద్ది రోజులకే సగానికి విరిగిపోతున్నాయి. భూమిలో మీటరు లోతు వరకు పాతాల్సి ఉండగా, చాలా చోట్ల ఒకటి రెండు ఫీట్లకు మించి తవ్వడం లేదు. పట్టు కోసం చుట్టూ సిమెంట్‌ వాడక పోవడంతో ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడి నేలకూలుతున్నాయి.

సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు పోల్‌పైకి ఎక్కే సమయంలో పట్టు దొరక్క కారి్మకులు కింద పడుతున్నారు. ఇటీవల కందుకూరు, మహేశ్వరంలో ఇద్దరు కారి్మకులు చనిపోవడానికి కూడా ఇదే కారణం. స్తంభాల చుట్టూ కేబుళ్లు భారీగా అల్లుకపోయి ఉండటంతో ఏ వైరు దేనికి సంబంధించిందో అర్థం కావడం లేదు. కార్మికులు పోల్‌పైకెక్కే సమయంలో ఎల్సీ తీసుకున్నప్పటికీ..కొంత మంది ఇళ్లలో జనరేటర్లు, ఇన్వర్టర్లు పని చేస్తుండటం వల్ల ఆయా వైర్ల నుంచి పోల్‌పైకి కరెంట్‌ రివర్స్‌ సప్లయ్‌ జరిగి కార్మికులు విద్యుత్‌షాక్‌కు గురవుతున్నారు.   

(చదవండి: 19 డిపోలు లాభాలబాట)

Advertisement
 
Advertisement
 
Advertisement