బీసీల హక్కులు కాలరాసే ప్రభుత్వాలపై ఉద్యమం  | BJP OBC Morcha National President Laxman Said Establishment Of BC Commissions In All States | Sakshi
Sakshi News home page

బీసీల హక్కులు కాలరాసే ప్రభుత్వాలపై ఉద్యమం 

Aug 6 2021 2:20 AM | Updated on Aug 6 2021 2:20 AM

BJP OBC Morcha National President Laxman Said Establishment Of BC Commissions In All States - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు ఏర్పాటు చేయడంతో పాటు చట్టబద్ధత కల్పించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ మాదిరిగా రాష్ట్రాల్లో బీసీ కమిషన్లు పనిచేయాలని కోరుతున్నామన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ ముస్లింలను ఓబీసీ జాబితాల్లో చేర్పించి బీసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపై ఆయా రాష్ట్రాల్లో ఓబీసీ మోర్చా పెద్దఎత్తున ఉద్యమం చేస్తుందని హెచ్చరించారు. గురువారం ఢిల్లీలోని ఓబీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ సంగమ్‌లాల్‌ గుప్తా నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement