ఎమ్మెల్యేగా రఘునందన్‌ రావు ప్రమాణ స్వీకారం

BJP Leader Raghunandan Rao Has Sworn In As Dubbaka MLA - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్‌ ఛాంబర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు అతికొద్ది మంది సమక్షంలో దుబ్బాక శాసనసభ సభ్యుడిగా రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. రఘునందన్ చేత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, బీజేపీ నేతలు, ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఎమ్మెల్యే రాజసింగ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు. చదవండి: రఘునందన్‌పై ఫిర్యాదు: మహిళ ఆత్మహత్యాయత్నం

కాగా నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరా హోరి పోరు సాగింది. మొత్తం 23 రౌండ్లలో సాగిన దుబ్బాక లెక్కింపులో రఘనందన్‌రావుకు 62, 772 ఓట్లు రాగా.. సోలిపేట సుజాతకు 61, 302 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. అత్యల్ప ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top