ఏడు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

Big Stone Collapse on Building in Hyderabad - Sakshi

మరో ఐదు నిమిషాలైతే ప్రాణాలు పోయేవి 

జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 44లోని నివాసంపై బండరాళ్లు పడిన ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు తాము జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఏడుసార్లు ఫిర్యాదు చేశామని అయినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. 30 అడుగుల  బండరాయి ఒక్కసారిగా భవనంపై పడటంతో ఆ శబ్ధానికి  ప్రాణం పోయినంత పనైంద న్నారు. ఆ సమయంలో భవనం వెనుక వైపు ఉన్న బెడ్‌రూమ్‌లో ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బెడ్‌రూమ్‌లో ఉన్న బండరాళ్లును చూస్తే ఒళ్ళు జలదరిస్తుందని అన్నారు.  

తవ్వకాలపై జూబ్లీహిల్స్‌ సొసైటీ కి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొండ తమ ఇంటిపైకి వాలుగా ఉన్న విషయాన్ని కాంట్రాక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని అయినా సద రు కాంట్రాక్టర్‌ దీనిని పట్టించుకోకుండా, కనీస అనుమతులు తీసుకోకుండా రాక్‌ కటి ంగ్‌ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించాడు. ఇంత పెద్ద బండరాయిని పగులగొట్టేటప్పుడు మైనింగ్‌ అనుమతులు తీసుకోవాల్సి ఉందని వారు ఇవేవి తీసుకోకుండా అడిగిన ప్రతిసారి తమకు జీహెచ్‌ఎంసీ అనుమతులు ఉన్నా యని బుకాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలోరూ. 40 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని దీనిని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top