బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్‌ తమిళిసై

Bathukamma Festival Celebrations 2021 At Raj Bhavan Governor Tamilisai Comments - Sakshi

రాజ్‌భవన్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం నుంచి బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్ భవన్‌లో కూడా ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తమిళి సై సౌందరరాజన్, కుటుంబ సభ్యులు, రాజ్ భవన్ మహిళ ఉద్యోగులుబతుకమ్మ వేడుకల్లో పాలుపంచుకున్నారు. 
(చదవండి: తెలంగాణ హృదయం– బతుకమ్మ)

తెలంగాణ ప్రజలకు ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు తమిళిసై. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ పండుగైనా బతుకమ్మను.. గవర్నర్‌గా, తెలంగాణ ఆడపడుచుగా రాజ్ భవన్‌లో ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నాం. ఈ ఏడాదే మా తల్లిని కోల్పోయాను... పండుగలు అన్నీ ఘనంగా జరుపుకోవాలనేది ఆమె కోరిక. ఆ మేరకు రాజ్ భవన్‌లో బతుకమ్మ వేడుకలు చేస్తున్నాం. 9 రోజుల పాటు తెలంగాణ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటిస్తూ..బతుకమ్మ వేడుకలు జరుపుకోవాలి’’ అని తమిళిసై సూచించారు.

చదవండి: నేటి నుంచి బతుకమ్మ సంబరాలు మొదలు.. పండుగ నేపథ్యం ఇదే

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top