మరో 1,890 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు | Sakshi
Sakshi News home page

మరో 1,890 స్టాఫ్‌ నర్స్‌ పోస్టులు

Published Sun, Dec 17 2023 4:40 AM

Arrangements for filling up 7094 staff nurse posts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక మొదటిసారిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 1,890 స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం శనివారం అనుబంధ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. గతంలో 5,204 స్టాఫ్‌ నర్స్‌ ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్టుల కోసం రాత పరీక్ష కూడా పూర్తయింది.

40 వేల మందికి పైగా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 1,890 స్టాఫ్‌ నర్స్‌ ఖాళీలను కూడా ప్రభుత్వం కలిపింది. దీంతో ఈ పరీక్ష ద్వారా మొత్తం 7,094 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వైద్య, ఆరోగ్య సేవల నియామక బోర్డు సభ్య కార్యదర్శి గోపీకాంత్‌ రెడ్డి తెలిపారు. త్వరలో ఫలితాలు వెలువడతాయని ఆయన పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement