చిత్రపురి కాలనీలో అక్రమాలు: నటుడు

Actor Kalyan Alleged Irregularities In Chitrapuri colony In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘సినీ కార్మికుల కోసం ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన చిత్రపురి కాలనీ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయి’ అని నటుడు, నిర్మాత కల్యాణ్‌ ఆరోపించారు. దాదాపు రూ. 300 కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆయన తెలిపారు. ఈ నెల 10న చిత్రపురి కాలనీ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికలు జరగనున్నాయి. సత్యమేవ జయతే అనే ప్యానల్‌ తరఫున ఒ.కల్యాణ్‌ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన  విలేకరులతో మాట్లాడారు. ఇరవై ఏళ్లుగా చిత్రపురి కాలనీకి సంబంధించి అవినీతి జరుగుతూనే ఉందన్నారు.

ఈ విషయంపై నిర్మాత సి. కల్యాణ్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు.  దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రూ.8 కోట్ల సబ్సిడీ ఇచ్చారని, ప్రస్తుత సీఎం  కేసీఆర్‌ ఇచ్చిన రూ.6 కోట్లు ఎటు పోయిందని ఒ.కల్యాణ్‌ ప్రశ్నించారు. హౌసింగ్‌ సొసైటీని మోసం చేసి మేనేజ్‌ చేసుకున్నారని ఆరోపించారు. సమావేశంలో అనిల్‌కుమార్‌ కావూరి, ఈశ్వరప్రసాద్‌ మీసాల, కస్తూరి శ్రీనివాస్, బి నరసింహారెడ్డి, పసునూరి శ్రీనివాసులు, మన్యవాసి వైవి, శ్రీనివాస్‌ కూనపురెడ్డి, ఆత్మకూరు రాధ, మల్లికా టి, మధు జాటోత్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top