తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు | 2384 New Coronavirus Cases Recorded In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు

Aug 23 2020 8:59 AM | Updated on Aug 23 2020 5:11 PM

2384 New Coronavirus Cases Recorded In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్తగా 2,384 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య లక్షా 4వేల 249కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 755కు పెరిగింది. కాగా కొత్తగా 1851 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. మొత్తం కోలుకున్నారి సంఖ్య 80,586గా నమోదైంది.

రాష్ట్రంలో ప్రస్తుతం 22,908 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలో హోమ్‌ ఐససోలేషన్‌లో ఉన్న వారి సంఖ్య 16,387గా ఉంది. ఇక కేసుల విషయానికి వస్తే.. జీహెచ్‌ఎంసీ-472, జగిత్యాల-105, ఖమ్మం-105, కరీంనగర్- 125, నల్గొండ-137, నిజామాబాద్-148, రంగారెడ్డి-131, సూర్యాపేట - 110గా ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement