కొన్నాళ్ల స్నేహం.. మృత్యువులోనూ విడదీయని బంధం

2 Persons Killed In Road accident At Karimnagar - Sakshi

ఆ యువకులకు ఇటీవలే పరిచయం ఏర్పడింది..  దూరపు బంధువులు కావడంతో వారి మధ్య చనువు పెరిగింది.. రెండు కుటుంబాల్లోనూ వీరు ఒక్కొక్కరే కుమారులు. ఇద్దరూ విద్యావంతులే.. కాస్త సమయం దొరికితే సరదాగా గడిపే మనస్తత్వం వారిది.. ఈనేపథ్యంలోనే ఇద్దరూ కలిసి ఆదివారం అర్ధరాత్రి భోజనం కోసమని కారు తీసుకుని నిజామాబాద్‌ జిల్లా పెర్కిట్‌ వైపు బయలు దేరారు.. భోజనం చేయకముందే లారీ రూపంలో వచ్చిన మృత్యువు మార్గమధ్యంలోనే ఇద్దరినీ హరించుకుపోయింది. కోరుట్ల పట్టణానికి చెందిన బెజ్జారపు సుమంత్, మండలోజు అనిల్‌ అగ్నికీలల్లో సజీవ దహనం కావడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

కరీంనగర్ (కోరుట్ల) : చేతికొచ్చిన కొడుకులు కారు ప్రమాదంలో సజీవ దహనం కావడం రెండు కుటుంబాల్లో తీవ్రవిషాదం నింపింది. ఈ రెండు కుటుంబాల్లోనూ ఒ క్కొక్కరే కుమారుడు ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల పట్టణానికి చెందిన బెజ్జారపు శ్రీనివాస్‌–మాధురి దంపతులకు సుమంత్‌(25), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సుమంత్‌ బీఎస్సీ (డయాలసిస్‌) కోర్సు పూర్తిచేసి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నట్లు సమాచారం. స్వర్ణకార వృత్తి చేసే మెట్‌పల్లి మండలం వెల్లుల్లకు చెందిన మండలోజు నారాయణ–విజయ దంపతుల కు అనిల్‌(26) కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నా రు. అనిల్‌ తండ్రితోపాటు స్వర్ణకార వృత్తిలో ఉన్నా రు. 

బెజ్జారపు సుమంత్, మండలోజి అనిల్‌ స్నేహితులు. ఆదివారం సాయంత్రం సుమంత్‌ మెట్‌పల్లికి వెళ్లి అనిల్‌ను కలిశాడు. ఆ తర్వాత ఇద్దరూ అర్ధరాత్రి 12 గంటల వరకు అక్కడే గడిపారు. అనంతరం తమ బంధువుల కారు తీసుకుని భోజనం చేసేందుకు నిజామాబాద్‌ జిలా పెర్కిట్‌ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో మోర్తాడ్‌ వద్ద కారు లారీని ఢీకొట్టి పక్కనే ఉన్న గోతిలోకి పడిపోయింది. ఆ వెంటనే మంటలు చెలరేగడంతో అనిల్, సుమంత్‌ మంటల్లో కాలిబూడిదయ్యారు. ప్రమాదంలో తమ కుమారులు మృతి చెందిన విషయాన్ని సోమవారం తెల్లవారుజామున తెలుసుకుని మండలోజి నారాయణ, బెజ్జారపు శ్రీనివాస్‌ కుటుంబాలు తీ వ్ర విషాదంలో మునిగిపోయాయి. మ«ధ్యాహ్న స మయంలో ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించారు. 

ఎమ్మెల్యే సంతాపం
నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌లో జరిగిన కారు ప్రమాదంలో సజీవదహనమైన యువకులు బెజ్జారపు సుమంత్, మండలోజి అనిల్‌ మృతిపై ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుమారులు కోల్పోయిన రెండు కుటుంబాలకు తన వంతుగా మనోధైర్యం అందించి అండగా ఉంటామన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top