సాక్షి, చైన్నె : చైన్నె, అన్నానగర్ ఐసీఎఫ్ సౌత్ కాలనీ, థర్డ్ అవెన్యూలోని విజయశ్రీ మహల్‌లో శుక్రవారం కళా ఉత్సవం పేరిట చేనేత, హస్తకళా ప్రదర్శన ప్రారంభమైంది. ఇందులో క్రాప్ట్స్, టెక్స్ టైల్స్‌తో పాటు హోమ్ డెకార్, జ్యువెలరీ, ఫుడ్ ఐటమ్స్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన చీరలు భాగల్పూరి, చందేరి, బెంగాల్ కాటన్, కంచి కాటన్, హుబ్లీ కాటన్, చెట్టినాడు కాటన్, లడక్ సిల్క్, కాశ్మీరీ సిల్క్, పోచంపల్లి చీరల రకాలు ఉన్నాయి. అలాగే కాటన్ టాప్స్, హ్యాండ్ వర్క్ టాప్స్, సల్వార్ సూట్లు ప్రదర్శనకు ఉంచారు. అంతేకాకుండా, వివిధ రకాల బొమ్మలు, గృహాలంకరణ కోసం ఎర్రకోట వస్తువులు, ఉడెన్ క్రాఫ్ట్ ఐటమ్స్, సిరామిక్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, కర్టన్ ఐటమ్స్, బెడ్ షీట్లు, సోఫాసెట్ కవర్లు, ఫర్నిచర్ ఐటమ్స్, కిడ్స్‌వేర్, కిడ్స్‌ప్లే ఐటమ్స్, జ్యువెలరీ రకాలు, ఇత్తడి కళారూపాలు ఉన్నాయి. ఈ ప్రదర్శన ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని, ఎంట్రీ, పార్కింగ్ ఉచితమని నిర్వాహకులు తెలిపారు. డిసెంబర్ 6వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.


