మారిన సాయి పల్లవి | - | Sakshi
Sakshi News home page

మారిన సాయి పల్లవి

Nov 28 2026 12:32 AM | Updated on Nov 28 2026 12:32 AM

అజిత్‌, నయనతార కనిపించకుండా పోతారు

తమిళసినిమా: అగ్ర హీరో హీరోయిన్లుగా వెలిగిపోతున్న నటీనటులు అజిత్‌, నయనతార. ఈ జంట పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు కూడా. అజిత్‌ చిత్రం కోసం ఆయన అభిమానులు ఇప్పటికీ ఎప్పుడు తెర పైకి వస్తుందా అని ఎదురుచూస్తుంటా రు. ఇక నయనతా ర గురించి ప్రత్యే కంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈమె ఇండియ న్‌ క్రేజీ హీరోయిన్‌. ఒక్కో చిత్రానికి రూ.10 కోట్లకు పైగానే పారితో షికం తీసుకునే నటి. అంతేస్థాయి లో విమర్శలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా అజిత్‌, నయనతార కామన్‌గా ఎదుర్కొనే ఆరోపణ చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనరని. అందుకు వీరి కారణాలు వారికి ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ నుంచి ఆరోపణలను మాత్రం ఎదుర్కొంటూనే ఉన్నారు. వీరి గురించి సినీ పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు, థియేటర్‌ అధినేత తిరుప్పూర్‌ సుబ్రహ్మణ్యం ఒక భేటీలో పేర్కొంటూ ‘‘నటుడు అజిత్‌, నటి నయనతార ఎలాంటి సినీ ప్రచార కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. అలా ఉండడానికి వాళ్ల తలపై ఏదో కిరీటం ఉందని భావిస్తున్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే వారిద్దరూ సినిమాలో కనిపించకుండా పోతారు’’ అని తెలిపారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీనికి నటుడు అజిత్‌, నయనతార ఎలా స్పందిస్తొరో చూడాలి. ఈ విషయాన్ని వాళ్లు అసలు పట్టించుకుంటారో, లైట్‌గా తీసుకుంటారో అన్న చర్చ జరుగుతోంది.

తమిళసినిమా: రామాయణం చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన దక్షిణాది నటి సాయి పల్లవి. ఈమె సాదా సీదాగా పాత్రల్లో నటించడానికి సమ్మతించే నటి కాదు. కథ బాగుండి, అందులో కథానాయకి పాత్రలో కొత్తదనం ఉంది అని అనిపిస్తేనే పచ్చజెండా ఊపుతారు. ఈ ఏడాదిలోనే రెండు చిత్రాల్లో వేర్వేరు పాత్రల్లో తనను తాను ఆవిష్కరించుకున్నారు. అందులో భారతీయ ఇతిహాసం రామాయణం చిత్రంలో మహాసాధ్వి సీతాదేవిగా ఒదిగి పోగా, మరొకటి తమిళ చిత్రం ఓంలో పోలీస్‌ అధికారిగా డైనమిక్‌ పాత్రలో నటించి మెప్పించారు. తాజాగా మరో కొత్త పాత్రతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. ఇది ఈమె ఇంతకు ముందు నటించిన రెండు చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్ర అని చెప్పవచ్చు. మణిరత్నం చిత్రాల్లో కథానాయికలకు కచ్చితంగా ప్రాముఖ్యత ఉంటుంది. అలా ఆయన తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇంజి వెళ్లం. విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో నటి సాయి పల్లవి నాయకిగా నటిస్తున్నారు. సెక్క సెవంద విధానం చిత్రం తర్వాత మణిరత్నం, విజయ్‌ సేతుపతి కాంబోలో రూపొందుతున్న చిత్రం ఇది. మణిరత్నం దర్శకత్వంలో నటి సాయి పల్లవి నటిస్తున్న తొలి చిత్రం. దీనికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సుభాస్కరన్‌ సమర్పణలో మెడ్రాస్‌ టాకీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2027 జనవరి 29వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు యూనిట్‌ వర్గాలు ఇప్పటికే వెల్లడించారు. ఈ చిత్రంలోని అచ్చీ అచ్చీ అనే పల్లవితో సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటలో నటి సాయి పల్లవి చాలా కొత్తగా కనిపించారు. స్టైల్‌గా కట్‌ చేసిన జుత్తు, మోడ్రన్‌ డ్రెస్‌, మేకప్‌ వంటి హంగులతో కనిపించారు. మేకప్‌కు దూరంగా సహజత్వానికి ప్రాధాన్యత నిచ్చే సాయి పల్లవిని దర్శకుడు మణిరత్నం ఇంజి వెళ్లం చిత్రం కోసం పూర్తిగా మార్చేశారా? అని అనిపిస్తోంది. ఇది ప్రేమ, మాతృత్వం, భావోద్వేగాలతో కూడి న కథా చిత్రంగా ఉంటుందని యూనిట్‌ వర్గాలు పేర్కొన్నారు. థగ్‌ లైఫ్‌ వంటి పూర్తి గా నిరాశ పరిచిన చిత్రం తర్వాత మణిరత్నం నుంచి వస్తున్న ఇంజి వెళ్లం చిత్రం సాధించే విజయంపై ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement