హామీల అమలు కమిటీ తొలి భేటీ | - | Sakshi
Sakshi News home page

హామీల అమలు కమిటీ తొలి భేటీ

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

● స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ దిశానిర్దేశం

సాక్షి, చైన్నె: తమిళనాడు శాసనసభ 2026–27 సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ హామీల కమిటీ తొలి సమావేశం బుధవారం జరిగింది. ఓమందూరార్‌ ప్రభుత్వ ఎస్టేట్‌లో కమిటీ చైర్మన్‌ ఆర్‌. విజయ్‌ శరవణన్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ ప్రారంభించారు.

హామీల పర్యవేక్షణ: శాసనసభలో మంత్రులు ఇచ్చిన హామీలు, వాగ్దానాలు నిర్దేశిత కాలపరిమితిలోగా కచ్చితంగా అమలువుతున్నాయా లేదా అని కమిటీ నిరంతరం పర్యవేక్షించాలని ఈసందర్భంగా స్పీకర్‌ సూచించారు. అమలు కాని హామీలపై తగిన సిఫారసులు చేసి సభకు నివేదికలు సమర్పించాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగానికి, శాసనసభకు మధ్య ఈ కమిటీ ఒక వారధిలా పనిచేయాలని సూచించారు. ప్రజా సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం మరియు సామాజిక సంక్షేమానికి సంబంధించిన హామీలను వేగంగా అమలు చేసేలా చూసే బాధ్యత సభ్యులపై ఉందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభ కార్యదర్శి శాంతి, కమిటీ సభ్యులు కె. అన్నదురై, కె. కరుణానిధి, ఎ. కుట్టి అలియాస్‌ సుధాకర్‌, ఇ.సి. గోవిందరాజన్‌, డి. షణ్ముగం, డాక్టర్‌ సతీష్‌, కె. సోమురుగన్‌, కె. రవి మనోహర్‌, కె. రామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement