చైన్నె టెక్‌ వర్గాలతో కర్ణాటక అధికారుల భేటీ | - | Sakshi
Sakshi News home page

చైన్నె టెక్‌ వర్గాలతో కర్ణాటక అధికారుల భేటీ

Sep 24 2026 1:42 AM | Updated on Sep 24 2026 1:42 AM

సాక్షి, చైన్నె: ఆసియాలోనే అతిపెద్ద సాంకేతిక, ఆవిష్కరణల వేదికై న బెంగళూరు టెక్‌ సమ్మిట్‌ 29వ ఎడిషన్‌ను పురస్కరించుకుని, కర్ణాటక ప్రభుత్వం చైన్నెలో ప్రత్యేక పరిశ్రమల సమావేశాన్ని బుధవారం చైన్నెలో నిర్వహించింది. నవంబర్‌ 17 నుండి 19వ తేదీ వరకు బెంగళూరులో జరిగే ఈ సమ్మిట్‌కు ఇక్కడి టెక్‌ వర్గాలను ఆహ్వానించారు.చైన్నెలోని టెక్‌, వర్తక దిగ్గజాలతో కర్ణాటక ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, బయోటెక్‌ శాఖ కార్యదర్శి డా. ఎన్‌. మంజుల ఎస్టీపీఐ చైన్నె డైరెక్టర్‌ సుబ్రహ్మణ్యం ఎస్‌.ఆర్‌., కర్ణాటక ఐటీ శాఖ డైరెక్టర్‌ డా. అవినాష్‌ మీనన్‌ రాజేంద్రన్‌, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ అశోక్‌ తదితరులు ఈ సమ్మిట్‌ గురించి వివరించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ , డీప్‌టెక్‌, ఎలక్ట్రానిక్స్‌ – సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, స్పేస్‌టెక్‌ వంటి అత్యాధునిక రంగాలపై చర్చలు జరగనున్నాయని, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ఫ్యూచర్‌ మేకర్స్‌ నిర్వహించనున్నామని, దీని ద్వారా కొత్త ఆవిష్కర్తలకు పెట్టుబడిదారులు, మెంటార్లతో అనుసంధానం కల్పిస్తామని వివరించారు. ఎలక్ట్రానిక్స్‌ , సెమీకండక్టర్‌ రంగాలకు చెందిన ప్రముఖ గ్లోబల్‌ ఈవెంట్‌ ’ంబెడెడ్‌ వరల్డ్‌ ఇండియా తొలిసారిగా ఈ సమ్మిట్‌తో కలిసి జరగడం మరో విశేషంగా పేర్కొంటూ, సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్‌ భాగస్వామ్యాలను పెంపొందించేందుకు ఈ సమ్మిట్‌ వేదిక కానుందని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement