తమిళనాడులో వ్యాపార సంఘాల మహానాడు
తిరువొత్తియూరు: తమిళనాడులోని అన్ని వ్యాపా ర సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో 43వ వ్యాపారుల దినోత్సవం, 8వ రాష్ట్ర మహాసభలు చైన్నె, వానగరంలోని శ్రీవారు వెంకటాచలపతి ప్యాలెస్‌లో మంగళవారం వైభవంగా సాగాయి. డిమాండ్ల సాధన కోసం మహాసభ అనే నినాదంతో ఈ రాష్ట్ర మహాసభలను వ్యాపార సంఘాలు నిర్వహించాయి. రాష్ట్ర అధ్యక్షుడు కొలత్తూరు డి. రవి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కవితా రవి జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు.ఈ మహాసభలో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జి. కె. వాసన్, వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, న్యాయమూర్తులు, పారిశ్రామిక వేత్తలు, అన్ని వ్యాపార సంఘాల నిర్వాహకులు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ప్రధాన కార్యాలయ కార్యదర్శి కే. కులైంద వేల్ చైన్నె మండల అధ్యక్షుడు ఎ. అరుణాచలమూర్తి, ఎ. జయరామన్, సమాచా ర సంబంధాల అధికారి ఎం. పి. రమేష్, జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాసభలో వ్యాపారుల కోసం ఉదయం, మధ్యాహ్నం శాకాహార, మాంసాహార భోజన వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. తమిళనాడు వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి కారు, వ్యాన్, ప్రత్యేక బస్సుల ద్వారా పెద్ద సంఖ్యలో వ్యాపారులు పాల్గొన్నా రు. మహాసభలో కొలత్తూరు రవి మాట్లాడు తూ తమిళనాడులో విదేశీ పెట్టుబడుల వల్ల చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని రక్షించేందుకు వ్యాపారు లందరూ ఐకమత్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యేగా ఎంపీ
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకేలో సీవీ షణ్ముగం సీనియర్ నేత. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. గత ఎన్నికలలో ఓటమి పాలు కావడంతో పార్టీ వద్ద పట్టుబట్టి మరీ రాజ్యసభ సీటును రాబట్టుకున్నారు. ఈ సారి ఆయన మైలం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. డీఎంకే, టీవీకే అభ్యర్థులతో సహా 21 మంది సీవీ షణ్ముగంను ఓడించే దిశగా ఇక్కడ పోటీచేశారు. అయితే, గత కొన్నేళ్లుగా సీవీ షణ్ముగం ఇక్కడి ప్రజలతో మమేకం కావడం విజయాన్ని వరించింది. 82,535 ఓట్లను ఆయన రాబట్టుకున్నారు. సుమారు 30 వేల ఓట్లమెజారిటీతో గెలిచిన సీవీ షణ్ముగం రాష్ట్ర రాజకీయాలే తనకు ముఖ్యం అన్న నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రం అందుకున్న సీవీ షణ్ముగం అదే చేతితో రాజ్య సభ పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
ఏఐ ఫీచర్ల సందడి
సాక్షి, చైన్నె: గ్రేట్ సమ్మర్ సేల్ 2026లో ఏఐ ఫీచ ర్లతో సందడి చేయనున్నట్టు అమెజాన్‌ఇండియా ప్రకటించింది. మే 8వ తేదీ అర్ధరాత్రి 12.00 గంటల నుండి సమ్మర్ సేల్ ప్రారంభం కానున్నట్టు మంగళవారం స్థానికంగా ప్రకటించారు. ఈసారి షాపింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేసేందుకు అమెజాన్ ఏఐ సాంకేతికతను భారీగా వినియోగిస్తున్నట్టు వివరించారు. భారీ తగ్గింపు, సరికొత్త ఉత్పత్తులు, ప్రైమ్ మెంబర్లకు అదనపు ప్రయోజనాల దిశగా ముందుకెళ్తున్నామని ప్రక టించారు.100 శాతం సర్వీసబుల్ పిన్ కోడ్‌లకు డెలివరీ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు తెలిపారు.
18 సవర్ల నగలు చోరీ
అన్నానగర్: చోళవరం సమీపంలోని ప్రభుత్వ టీచర్ ఇంట్లో 18 సవర్ల బంగారు నగలు, రూ.50 వేల నగదు చోరీకి గురయ్యాయి. తిరువళ్లూరు జిల్లాలోని చోళవరం సమీపంలో ఉన్న ఎడప్పాళైయం గ్రామానికి చెందిన పద్మావతీ అంధురా లు. ప్రభుత్వ పాఠశాలలో టీచర్. ఈమె భర్త సో మవారం ఊరికి వెళ్లాడు. ఈ స్థితిలో అర్ధరాత్రి వేడి గా ఉండడంతో తలుపు తెరిచి నిద్రపోయింది. మంగళవారం ఉదయం లేచి చూడగా బీరువాలో ఉంచిన 18 సవర్ల బంగారు నగలు, రూ.50యాభై వేల నగదు చోరీకి గురైనట్లు తెలిసింది. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అందిన సమాచారం ఆధారంగా చోళవరం పోలీసులు సంఘటన స్థలానికి చే రుకుని దర్యాప్తు ప్రారంభించారు. చోళవరం పో లీసులు రోడ్లపై ఏర్పాటు చేసిన నిఘా కెమెరాల ఫుటేజీని కూడా పరిశీలిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రౌడీ దారుణ హత్య
అన్నానగర్: మైలాడుదురై సమీపంలో పాత కక్షల కారణంగా ఓ రౌడీని దారుణంగా నరికి హత్య చేసిన ఇద్దరు సోదరులను మనల్మేడు పోలీసుల అరెస్టు చేశారు. ఈ ఘటనలో హత్యకు పాల్పడిన వ్యక్తి ఇంటిని ప్రత్యర్థి వర్గం ధ్వంసం చేసి, నిప్పంటించారు. మైలాడుదురై జిల్లా సమీపంలోని ఆత్తూర్ నడుతేరు, మనల్మేడు పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే సుమన్ (48)పై పలు కేసులు ఉన్నాయి. ఈనేపథ్యంలో, గత 3వ తేదీ రాత్రి 8 గంటలకు, ఆత్తూర్ మెయిన్ రోడ్ బ్రిడ్జి సమీపంలో సుమన్ బైక్‌లో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దారి అడ్డగించి కొడవలితో తలను వేరుగా నరికేశారు, సుమన్ అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలిసి మనల్మేడు పోలీసులు అక్కడికి వెళ్లి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తిరువారూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు సంబంధించి మురళి అనే యువకుడు మనల్మేడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ హత్యలో ప్రమేయం ఉన్న మరో వ్యక్తి, మురళి సోదరుడు ధర్మను మనల్మేడు పోలీసులు అరెస్టు చేసి విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో సుమన్ బృందం కడలంగూడిలోని మురళి ఇంటిని ధ్వంసం చేసి, గడ్డివాముకు నిప్పు పెట్టింది. వారు అత్తూరులోని మురళికి చెందిన మరో ఇంటిని కూడా ధ్వంసం చేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఆత్తూరులోని స్థలం విషయంలో సుమన్, మురళిల మధ్య చాలా ఏళ్లుగా వివాదం నడుస్తోందని విచారణలో తెలిసింది.


