వేలూరు: రాజకీయాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే టీఎన్ 2026 చిత్రం విడుద ల చేసినట్లు సినీ డైరెక్టర్, నటుడు తంబి రామ య్య అన్నారు. వేలూరులోని విష్ణు సినిమా థియేటర్‌లో ఈ సినిమాను ఆ సినీ బృందం పాఠకులతో కలిసి సినిమాను తిలకించారు. అనంతరం ఆ బృందం విలేకరులతో మాట్లాడుతూ ఈ సినిమాను కుటుంబమంతా కలిసి చూసే విధంగా ఈ సినిమా కామెడి ఎంటర్‌టైనర్‌గా ఉందన్నారు. ఈ సినిమాలో తాము ఎవరినీ ఉద్దేశించి వ్యక్తిగతంగాను నొప్పించడానికి సినిమా తీయలేదన్నారు. ఈ చిత్రంలో కేవలం ప్రజలను అలరించడానికి మాత్రమే రూపొందించడం జరిగిందన్నారు. అనంతరం ప్రేక్షకులకు పలు సంక్షేమ పథకాలతో పాటు పంచె చీరలను పంచి పెట్టారు. కార్యక్రమంలో టీఎన్ 2026 సినీ దర్శకుడు ఉమాపతి, నటుడు నటరాజన్, సినీ బృందం పాల్గొన్నారు.
సాక్షి, చైన్నె: చైన్నెలోని ఇండియన్ స్క్వాష్ అకాడమీలో గత ఐదు రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన హెచ్‌సీఎల్ స్క్వాష్ టూర్ సోమవారం ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 16 నుండి 20 వరకు జరిగిన ఈ టోర్నీలో ఏడు దేశాల నుండి 48 మంది క్రీడాకారులు తలపడ్డారు. పురుషులు, మహిళల విభాగాల్లో తలా 6,000 అమెరికన్ డాలర్ల ప్రైజ్‌మనీ కోసం జరిగిన పోటీల్లో అత్యున్నత స్థాయి క్రీడానైపుణ్యాన్ని క్రీడాకారులు ప్రదర్శించారు. పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన సూరజ్ కుమార్ చంద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జెయోంగ్మిన్ ర్యూను ఓడించి టైటిల్ కై వసం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఈజిప్ట్ క్రీడాకారిణి రౌకై యా ఒత్మాన్ తన దూకుడైన ఆటతీరుతో మలేషియాకు చెందిన హర్లీన్ టానన్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచారు. ఈ టోర్నీ ముగింపు సందర్భంగా హెచ్‌సీఎల్ గ్రూప్ స్ట్రాటజీ ప్రెసిడెంట్ సుందర్ మహాలింగం ,స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రటరీ జనరల్ సైరస్ పొంచాలు విజేతలకు ట్రోఫీ, నగదు బహుమతి అందజేశారు.
కొరుక్కుపేట: వజ్రాభరణాల విక్రయంలో దక్షిణాదిలో పేరుగాంచిన లలితా జువెలరీ మార్ట్ తన 63వ షోరూంను సోమవారం చైన్నెలో ప్రారంభించింది.చైన్నె టి.నగర్ ఉస్మాన్ రోడ్డు పనగల్ పార్కు వద్ద వున్న ప్రధాన షోరూమ్ పక్కనే రెండో నూతన షోరూమ్‌ను ఆ సంస్థ అధినేత డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ దంపతులు జ్యోతిప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎం. కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. తను ఆభరణాల విక్రయవేత్తగా తను ఎక్కడ జీవితం ప్రారంభించానో , దాని పక్కనే మరో కొత్త షోరూం ప్రారంభించడం ఆనందంగా వుందన్నారు. ప్రత్యేకించి అక్షయతృతీయ రోజున ఈ కొత్త లలితా జువెలరీ షోరూమ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని వచ్చినట్టు తెలిపారు. షోరూం ప్రారంభోత్సవం, అక్షయ తృతీయ సందర్భంగా లలిత జువెలరీ అన్ని బంగారు ఆభరణాలపై విలువ జోడింపు చార్జీలలో 1 శాతం తక్కువ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోందన్నారు.


