ఏడుకు ఐజేకే పట్టు
సాక్షి, చైన్నె : తమకు ఏడు అసెంబ్లీ సీట్లు కేటాయించానలి అన్నాడీఎంకేను ఐజేకే విన్నవించింది. తాము ఆశిస్తున్న నియోజకవర్గాల జాబితాను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామికి ఐజేకే నేత పచ్చముత్త పారివేందర్, రవి పచ్చముత్తు గురువారం అందజేశారు. అన్నాడీఎంకే కూటమిలో ఐజేకే ఉన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితులలో ఐజేకే తాము పోటీ చేయదలిచిన ఏడు స్థానాల వివరాలతో కూడిన జాబితాను పళణి స్వామికి అందజేశారు. పళణిస్వామితో చైన్నెలో అర్ధగంటకు పైగా పారివేందర్, రవి పచ్చముత్తులు సమావేశమయ్యారు. ఏడు స్థానాలతో పాటూ ఓ రాజ్యసభ ఇవ్వాలన్న విజ్ఞప్తిని సైతం ఈ సందర్భంగా పళణి ముందు ఉంచినట్టు సమాచారం.


