పెళ్లి చేయలేదని తండ్రిని హత్య చేసిన తనయుడు
వేలూరు: పెళ్లి చేయడం లేదనే కోపం తండ్రిని హత్య చేసిన తనయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని పెరియపేట గ్రామానికి చెందిన ఉలగనాధన్(78) ఇతని కుమారుడు హరీష్. కరోనా కాలంలో ఉలగనాథన్ భార్య మృతి చెందింది. ఇతని కుమార్తెకు వివాహం జరిగి భర్త ఇంట్లో ఉంది. దీంతో తండ్రీ, కుమారులు ఇద్దరు మాత్రమే ఇంటిలో నివశిస్తున్నారు. హరీష్‌కు కొంత మతిస్థిమితం కోల్పోయినట్లు తెలుస్తోంది. దీంతో హరీష్‌కు పలు చోట్ల వివాహ సంబంధాలు చూసిన కుదరలేదు. దీంతో తండ్రీ, కొడుకుల మధ్య తరచూ ఘర్షణ జరిగేది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఇద్దరి మధ్య యధావిదిగా ఘర్షణ ఏర్పడింది. దీంతో ఆగ్రహించిన హరీష్ ఇంట్లో ఉన్న కత్తితో తండ్రిని అతి దారుణంగా నరికాడు. రక్తపు మడుగులో పడి ఉలగనాథన్ అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించి వానియంబాడి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కుమారుడు హరీష్‌ను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. వివాహం చేయలేదని కన్న తండ్రిని హత్య చేసిన ఘటన ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.
మృతుడు ఉలగనాథన్(ఫైల్), కుమారుడు హరీష్
పెళ్లి చేయలేదని తండ్రిని హత్య చేసిన తనయుడు


