గంజాయి విక్రయానికి యత్నం
తిరువళ్లూరు: రైల్వేస్టేషన్‌కు సమీపంలో గంజాయి విక్రయించడానికి యత్నించిన ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి 8 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌కు సమీపంలో గంజాయి విక్రయిస్తున్నట్టు పోలీసులకు రహాస్య సమాచారం అందింది. ఇందులో భాగంగానే పోలీసులు అక్కడ నిఘా వుంచారు. ఈ క్రమంలో రైల్వేస్టేషన్‌కు సమీపంలో అనుమానస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో పట్టుబడిన రాజస్థాన్‌కు చెందిన నరేష్‌కుమార్, ఒడిస్సాకు చెందిన జగద్‌బద్రాగా గుర్తించారు. ఇద్దరూ ఆంధ్ర, కేరళ తదితర రాష్ట్రాల నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరువళ్లూరు రైల్వేస్టేషన్‌లో యువకులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్టు నిర్ధారించారు. అనంతరం ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


