రూ.1.23 కోట్లతో వీధి దీపాలు
తిరువళ్లూరు: నెమిలిచ్చేరి నుంచి నడుకుత్తగై దాకా రూ.1.23 కోట్లతో విద్యుద్దీపాలు, స్తంభాలు ఏర్పాటు చేసే ప్రక్రియను రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్ ప్రారంభించారు. తిరువళ్లూరు జిల్లా నెమలిచ్చేరి నుంచి నడుకుత్తగై వరకు వీధి ధీపాలను ఏర్పాటు చేయాలని స్తానికులు కోరుతున్నారు. ఇందులో భాగంగానే నిదులు సేకరించి విద్యుత్ స్తంభాలు, వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనులను మంత్రి నాజర్ ప్రారంభించారు. మంత్రి నాజర్ మాట్లాడుతూ 146 విద్యుత్ స్తంభాలు, 296 విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. త్వరలోనే పనులను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. వీధి దీపాలు ఏర్పాటు చేస్తే ప్రజల రాకపోకలకు సౌకర్యంగా వుండడంతో పాటు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. కలెక్టర్ ప్రతాప్, పూందమల్లి ఎమ్మెల్యే కృష్ణస్వామి, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్ పాల్గొన్నారు.


