విద్యా విజన్ లక్ష్యం
సాక్షి, చైన్నె: ఏఎస్‌వీఏ అడ్వాన్స్‌డ్ స్కూల్స్ విజన్ అలయన్స్ జాతీయ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం జరిగింది. విద్యారంగంలో ఒక కీలక అంశాన్ని సూచించడమే కాకుండా, కొత్త విజన్ లక్ష్యంగా విద్యా సంస్థల భాగస్వామ్యం, సైన్స్, పరిశోధన, పాఠశాల విద్య వంటి అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. కార్యక్రమానికి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్‌కుమార్, ఐఐఎస్‌సీ డీన్ డాక్టర్ ఎస్‌కే సతీష్, పద్మభూషణ్ బీఎన్ సురేష్, సీ మెట్ డైరెక్టర్ జనరల్ ఆర్ రతీష్, సీఎస్‌ఐఆర్ డైరెక్టర్ సి. అనంతరామకృష్ణన్, ఎన్‌సీఈఎస్‌ఎస్ డైరెక్టర్ ఎన్‌వీ చలపతిరావు, స్పేస్ ఫిజిక్స్ డైరెక్టర్ తరుణ్‌కుమార్ హాజరై ఏఎస్‌వీఏ వెబ్ సైట్‌ను ఆవిష్కరించడమే కాకుండా, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు.


