తెప్పపై శ్రీపార్థసారథి విహారం
తిరుపతి కల్చరల్: శ్రీగోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారథి స్వామివా రు తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు సర్వాంగ సుందరంగా అలంకృతులైన స్వామివారు దేవేరులతో కలిసి తె ప్పను అధిరోహించి పుష్కరిణిలో ఐదు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేశారు. అనంతరం ఆలయ నా లుగు మాడ వీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. బుధవారం శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వా మి వారు తెప్పపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రదర్శించిన హరికథాగానం, భజనలు, సంగీత విభావరి భక్తులను ఆకట్టుకున్నాయి. తిరుమల పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈఓ శాంతి, ఏఈఓ నారాయణ చౌదరి, సూపరింటెండెంట్ శేషగిరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ ధనుంజయ పాల్గొన్నారు.


