రవాణా వాహనాలు ఢీ
ఓవర్‌టేక్ చేసే యత్నంలో ఘోర ప్రమాదం లారీని ఢీకొని మోపెడ్‌పై వెళ్తున్న వారిపై పడిన మినీ టెంపో డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం ఇద్దరికి తీవ్రగాయాలు
సేలం: రోడ్డు ప్రమాదంలో మినీ టెంపో డ్రైవర్ సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. మంగళవారం ఓ గూడ్స్ ట్రక్ నామక్కల్ నుంచి తిరుచ్చికి వెళుతోంది. అలాగే తిరుచ్చి నుంచి బెంగళూరుకు బస్తాలతో మహేంద్ర పికప్ గూడ్స్ మినీ టెంపో నామక్కల్ వైపు వస్తోంది. మంగళవారం ఉదయం 6 గంటలకు నామక్కల్–తిరుచ్చి రోడ్డులోని రైల్వే ఫ్లైఓవర్ వద్ద ఇవి ఘోర ప్రమాదానికి గురయ్యాయి. పెయింటింగ్ పనులకు మోపెడ్‌పై వెళ్తున్న నామక్కల్‌కు చెందిన సేనాతిపతి (24), ఆకాష్ (24), కార్తీక్ (25)ను ఫ్రై ఓవర్ మీద ఓవర్‌టేక్ చేసే యత్నంలో మినీ టెంపో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని అదుపు తప్పి మోపెడ్ రైడర్లపై పడింది. దీంతో మోపెడ్‌పై వెళ్తున్న సేనాధిపతి, కార్తీక్, కర్ణాటకకు చెందిన మినీ టెంపో డ్రైవర్ సయ్యద్ యాసిన్ (30) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అలాగే మోపెడ్ నడుపుతున్న ఆకాష్, కర్ణాటకలోని సామ్రాజ్ నగర్‌కు చెందిన ట్రక్ డ్రైవర్ రాజేష్ (45) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంతో నామక్కల్ –తిరుచ్చి రోడ్డుపై గంటసేపు ట్రాఫిక్ స్తంభించింది. గాయపడిన వారిని స్థానికులు వెలికితీసి నామక్కల్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నమక్కల్ ఏఎస్పీ ఆకాష్ జోషి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. నామక్కల్ పోలీసులు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్రేన్‌తో తొలగిస్తున్న పోలీసులు
నుజ్జు నుజ్జు అయిన మినీ టెంపో
రవాణా వాహనాలు ఢీ


