ప్రైవేటు వైద్యశాల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు వైద్యశాల సీజ్‌

Jun 8 2025 1:05 AM | Updated on Jun 8 2025 1:05 AM

ప్రైవ

ప్రైవేటు వైద్యశాల సీజ్‌

తిరువళ్లూరు: నిబంధనలను అతిక్రమించి వైద్యం చే స్తున్న ప్రయివేటు వైద్యశాలకు ఆరోగ్యశాఖ అధికా రులు శనివారం ఉదయం సీల్‌ వేశారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి సిందలకుప్పంలో ఆల్పా అనే ప్రైవేటు వైద్యశాల ఉంది. ఈ వైద్యశాలకు వచ్చే రోగుల కు కాలం చెల్లిన మందులను ఇవ్వడం, ఫీజుల పేరిట భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందా యి. దీంతో ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ అంబిక నేతృత్వంలోని అధికారుల బృందం వైద్యశాలను తని ఖీ చేసింది. తనిఖీల్లో నిబంధనలను అతిక్రమించినట్టు నిర్ధారణ కావడంతో వైద్యశాలకు సీల్‌ వేశారు.

లారీ ఢీకొని ఎస్‌ఐకి గాయాలు

తిరుత్తణి: వాహన తనిఖీలు చేస్తున్న ఎస్‌ఐని లారీ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తిరుత్తణి ట్రా ఫి క్‌ ఎస్‌ఐ దివాకర్‌ సిబ్బందితో కలిసి శుక్రవారం అరక్కోణం రోడ్డులో వల్లియమ్మపురం వద్ద వాహన తనిఖీలు చేస్తున్నారు. ఆ సమయంలో అరక్కోణం నుంచి తిరుత్తణికి వెళుతున్న లారీ తనిఖీ లు నిర్వహిస్తున్న ఎస్‌ఐ దివాకర్‌ను ఢీకొంది. ప్రమాదంలో దివాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్‌ శ్రీనివాసన్‌ను(50) అరెస్టు చేశారు.

ప్రైవేటు వైద్యశాల సీజ్‌ 
1
1/1

ప్రైవేటు వైద్యశాల సీజ్‌

Advertisement
 
Advertisement
Advertisement