
మాస్క్ తప్పనిసరి కాదు
● ఆరోగ్య శాఖ
సాక్షి, చైన్నె : మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పొరుగన ఉన్న కేరళలో కరోనా కేసులు పెరుగుతుండడంతోపాటు ఇద్దరు మరణించినట్టుగా సమాచారం వెలువడింది. అయితే ఈ ఇద్దరికి గతంలో ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు వెలుగు చూశాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో కరోనా బారిన సుమారు 60 మందికి పైగా పడినట్టు సమాచారం వెలువడింది. ఇందులో పలువురు చికిత్స పొందుతున్నట్లు సంకేతాలు వచ్చాయి. కొత్త వేరియంట్ కరోనా విజృంభించే అవకాశాలున్నాయని, మాస్క్ ధరించాల్సిందేనన్న ప్రచారం ఊపందుకుంది. జనంలో ఆందోళన రెకెత్తించే సమాచారాలు హల్‌చల్ చేయడంతో ఆరోగ్యశాఖ శుక్రవారం ఈ ప్రకటన విడుదల చేసింది. జన సంచార ప్రాంతాల్లో మాస్క్‌లు తప్పనిసరి కాదని, తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేని స్పష్టం చేసింది. కరోనా వ్యాపించకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొంది. ప్రజలు తమ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏదేని సమస్య వస్తే వైద్యులను సంప్రదించాలని సూచించింది.
పెళ్లి రద్దుకు నేను కారణమా?
తమిళసినిమా: నటుడు రవిమోహన్, ఆర్తిల మధ్య వివాదం, వివాహ రద్దుకు తీసిన విధం గురించి పత్రికల్లో , సామాజిక మాధ్యమాల్లో కాస్త ఎక్కువగానే ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నా, రవిమోహన్, ఆర్తి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మధ్యలో గాయని కెనిషా ఫ్రాన్సిస్‌ను లాగుతున్నారు. అసలు రవిమోహన్, ఆర్తి వివాహ రద్దు వరకూ వెళ్లడానికి కెనిషానే కారణం అని కొందరు ఆమైపె మాటల యుద్ధం చేస్తున్నారు. ఆ విషయాన్ని ఆర్తి చెప్పడమే కారణం. ఈ వ్యవహారంపై కెనిషా స్పందించారు. ఆమె తన ఇన్‌స్టాలో పేర్కొంటూ ‘నేను నాపై వస్తున్న కామెంట్స్‌ను ఆపే ప్రయత్నం చేయను. ఎక్కడికీ పారిపోను.ఈ వ్యవహారంలో దాచేదేమీ లేదు కూడా. నా చర్యలపై ప్రశ్నించే హక్కు మీకు ఉంది. ప్రస్తుతం జరుగుతున్న దేనికై నా నేను కారణం అనిపిస్తే నన్ను కోర్టుకు తీసుకెళ్లండి. నిజాలేమిటో చట్టపరంగా వెలువడినప్పుడు మీకు అర్థం అవుతుంది’ అని గాయని కెనిషా పేర్కొన్నారు. రవిమోహన్, ఆర్తిల వ్యవహారంపై ఇకపై ఎవరూ కామెంట్స్ చేయరాదని న్యాయస్థానం హెచ్చరించిందన్నది గమనార్హం. దీంతో వీరి విషయంలో న్యాయస్థానం ఇచ్చే తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వీఎంఎల్‌ఎస్‌లో ఘనంగా ఓపెన్ డే 2025
సాక్షి, చైన్నె: వినాయక మిషన్ లా స్కూల్‌లో విజయవంతంగా ఓపెన్ డే 2025 కార్యక్రమం జరిగింది. శుక్రవారం పెద్ద సంఖ్యలో పయనూరు క్యాంపస్‌కు విద్యార్థులు తరలి వచ్చారు. విద్యా దృక్పథం, మౌలిక సదుపాయాలు, న్యాయ నిపుణుల సలహాలు, సూచనలు, వివిధ ప్రదర్శనలతో పాటు విద్యార్థులకు సమగ్ర సమాచారాలను తెలియజేశారు. ఆ విద్యా సంస్థ చాన్సలర్ డాక్టర్ ఎఎస్ గణేషన్, ఉపాధ్యక్షులు అనురాధ, చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ జె సురేష్ శామ్యూల్ ఈసందర్భంగా న్యాయ విద్యలో అత్యుత్తమ ప్రమాణాల గురించి వివరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటరాక్టివ్ సెషన్లలో తమకు కావాల్సిన సమాచారాలను రాబట్టారు. ఈ సందర్భంగా ఆ విద్యాసంస్థ డీన్ డాక్టర్ అనంత్ పద్మనాభన్ మాట్లాడుతూ న్యాయవిద్య అభివృద్ధి, న్యాయ రంగంలోకి విస్తృత శ్రేణి అవకాశాలు, తమ కోర్సులు, విద్యా సహకారం గురించి వివరించారు. చెంగల్పట్టు బార్ అసోసియేషన్ న్యాయవాది మునీశ్వరన్, సీనియర్ న్యాయవాది డాక్టర్ ఎఫ్రాన్సిస్ జులియన్, తదితరులు విద్యార్థులకు ఓపెన్ డేలో తమ సూచనలు,సలహాలు ఇచ్చారు.
డీఎంకే అధికారాన్ని
కోల్పోవడం ఖాయం
కొరుక్కుపేట: ప్రస్తుతం ప్రజలు అన్నాడీఎంకే వైపు ఉన్నారు. అందువల్ల, 2026 ఎన్నికల్లో డీఎంకే అధికారం కోల్పోవడం ఖాయమని మాజీ మంత్రి ఆర్.పి.ఉదయకుమార్ అన్నారు. తమిళనాడులో పెరుగుతున్న లైంగికదాడులను నిరోధించడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని ఖండిస్తూ శుక్రవారం తంజావూరులో అన్నాడీఎంకే ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరుగుతోంది. ఉదయకుమార్ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి స్టాలిన్ గత మూడేళ్లుగా నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదని, తనను విస్మరిస్తున్నారని ఆరోపించారు. కానీ స్టాలిన్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతున్నారని ఆయన ఢిల్లీ వెళ్లారు. ఈ కేసులో నిందితులను రక్షించడానికే ఆయన ఢిల్లీ వెళ్లారనే అనుమానం ఉందన్నారు.

మాస్క్ తప్పనిసరి కాదు