మాట్లాడుతున్న డాక్టర్ వి.రామసుబ్రమణియన్
కొరుక్కుపేట: ఇన్ ప్లూయెంజా జ్వరాలకు కారణమైన వైరస్ వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్యులు సైతం అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అపోలో ఆసుపత్రులు వైద్యనిపుణుడు డాక్టర్ వి. రామసుబ్రమణియన్ తెలిపారు. చైన్నెలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిన్నటి వరకు కరోనా కల్లోలం కొనసాగితే ప్రసుత్తం ఇన్ ఫ్లూయెంజా పంజా విసురుతోందన్నారు. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ఈ వైరల్ జ్వరాలు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ముందస్తు పరీక్షలు చేసుకోవాలని, లేకుంటే నిమోనియాతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. బాధితులు ఇమ్యూనిటీని పెంచే వ్యాక్సిన్ వేసుకుంటే మంచిదని చెప్పారు. ఈ విషయంలో నిర్లక్ష్యం తగద న్నారు. ఈ సమావేశంలో అబాట్ ఇండియా వైద్యసేవల విభాగం డైరెక్టర్ డాక్టర్ జిజో కరణ్ కుమార్ పాల్గొన్నారు.


