నీట మునిగి నలుగురు విద్యార్థుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

నీట మునిగి నలుగురు విద్యార్థుల దుర్మరణం

Published Mon, Mar 20 2023 1:56 AM | Last Updated on Mon, Mar 20 2023 1:56 AM

-

సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి

రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేసియా

సాక్షి, చైన్నె: శివగంగై, మైలాడుతురై జిల్లాలో నీట మునిగి నలుగురు చిన్నారుల మరణించిన ఘటనపై సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఎక్స్‌గ్రే షియా ప్రకటించారు. వివరాలు.. శివగంగై జిల్లా సింగంపునరి పరిధిలోని వారవూర్‌ గ్రామానికి చెందిన నాగరాజ్‌ కుమార్తె యామిని(10), మహేంద్రన్‌ కుమారుడు లక్ష్మణన్‌(7), లక్ష్మణన్‌ కుమారుడు సంతోష్‌(5) శనివారం సాయంత్రం సమీపంలోని కొలనులోకి స్నానానికి వెళ్లి మృతి చెందారు. అలాగే మైలాడుతురై జిల్లా తరంగం బాడికి అయ్యర్‌ కాలనీకి చెందిన ప్లస్‌–1 విద్యార్థి (17) అభినేష్‌ చెరువులో స్నానానికి వెళ్లి మరణించాడు. ఒకే రోజు నలుగురు పిల్లలు మరణించడంతో సీఎం స్టాలిన్‌ బాధిత కుటుంబాలను ఓదార్చుతూ.. ఆదివారం తన సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఏడాదిలో 2,116 లీటర్ల

తల్లి పాల సేకరణ

కొరుక్కుపేట: చిన్నారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో తల్లి పాల బ్యాంకులను ఏర్పాటు చేశారు. వీటిపై రాష్ట్రంలోని మహిళల్లో కొంత అవగాహన ఉండడంతో, పాలిచ్చే తల్లులు తమ బిడ్డలకు పాలు ఇస్తూనే, తమ పాలను దానం చేస్తున్నారు. కోయంబత్తూరులో రూప అనే యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇందుకోసం ప్రత్యేకంగా మహిళల అమృతం అనే సంస్థను ప్రారంభించింది. అప్ప టి నుంచి ఆమె కోయంబత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి పాలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ ఉద్య మం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది. చాలా మంది మహిళలు తల్లి పాలను దానం చేస్తున్నారు. గత ఏడాది తమిళనాడు వ్యాప్తంగా 2,116 లీటర్ల తల్లి పాల ను మహిళలు దానం చేసినట్లు రూప ఆదివా రం తెలిపారు. 17 జిల్లాలకు చెందిన తల్లులు ఈ యజ్ఞంలో పాలుపంచుకున్నట్లు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు

నెల్లూరు వాసుల మృతి

సాక్షి, చైన్నె: పెరంబలూరు జిల్లా మానామదురై జాతీయ రహదారిలో చేపల లోడుతో వెళ్తున్న వ్యాన్‌, లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మరణించారు. వివరాలు.. తంజావూరు నుంచి అరియలూరు వైపుగా శనివారం అర్ధరాత్రి వెళ్తున్న ఓ కంటైనర్‌, తంజావూరు వైపుగా వస్తున్న ఓ మినీ సరకుల వ్యాన్‌ తిరుమానూరు వద్ద ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మినీ సరకుల వ్యాన్‌ రోడ్డు పక్కన ఉన్న కొలనులో బోల్తా పడింది. గాయపడ్డ డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మార్గం మధ్యలో మరణించాడు. వ్యాన్‌ కొలనులోకి దూసుకెళ్లడంతో అందులోని మరొకరు ఘటనా స్థలంలోనే మరణించా డు. వ్యాన్‌లో ఉన్న గుర్తింపు కార్డులలోని వివరాల ఆధారంగా మృతులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండయపాళ్యానికి చెందిన వేంకటేశ్వర్లు కుమారుడు రాజ, సత్యనారాయణ కుమారుడు రమేష్‌గా గుర్తించారు. మృత దేహాలను పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు ఈ సమాచారాన్ని నెల్లూరులోని వ్యాన్‌ యజమానికి చేర వేశారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌ సురేష్‌, మరో వ్యక్తి మహ్మద్‌ ఇబ్రాహీం గాయపడ్డారు.

న్యూస్‌రీల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement