ముందస్తు జాగ్రత్తలతోనే ప్రమాదాల నివారణ
అర్వపల్లి: సంఘటనా స్థలాన్ని ఎస్సీ నరసింహ సందర్శించారు. కారు ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. అజాగ్రత్తగా వాహనం నడపడం, సీటు బెల్ట్ ధరించకపోవడం వల్లనే ప్రమాదం సంభవించి ప్రా ణనష్టం జరిగినట్లు తెలుస్తుందన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రదేశాల్లో వేగ నియంత్రణ, రోడ్డు భద్రత నియమాలు తెలియజేసే సూచికలు, ఏర్పాటు చేయాలని హైవే అధికారులకు సూచించారు. ప్రమాదంపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట సీఐలు నాగేశ్వర్‌రావు, రామారావు, ఎస్‌ఐ సైదులు, తహసీల్దార్ శ్రీకాంత్, ఏఎస్‌ఐ రాములు ఉన్నారు.


