జనరల్‌కే అధికం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీలకు ప్రభుత్వం శనివారం రిజర్వేషన్లు ఖరారు చేసింది. నల్ల గొండ మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కాగా.. మిగితా 18 మున్సిపాలిటీల్లో 14 జనరల్‌కు దక్కాయి. అందులో కార్పొరేషన్‌తో పాటు 17 మున్సిపాలిటీల్లో (నకిరేకల్ మినహా) ఎన్నికలు జరుగనున్నాయి.
జనరల్ స్థానాల్లో సగం మహిళలకు..
ఉమ్మడి జిల్లాలోని ఒక కార్పొరేషన్, 18 మున్సిపాలిటీల్లో 14 మున్సిపాలిటీల ఛైర్మన్ స్థానాలను స్థానాలను అన్‌రిజర్వుడ్/జనరల్ చేసింది. ఈ స్థానాలు అన్నింటిలో రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఏ సామాజిక వర్గం వారైనా పోటీ పడొచ్చు. అయితే అందులో 7 స్థానాలను మహిళలకు కేటాయించింది. ఆ స్థానాల్లో ఏ సామాజిక వర్గం వారైనా మహిళలు మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. మిగితా సగం స్థానాలు పురుషులకు దక్కనునున్నాయి. ఇక బీసీలకు 2020 ఎన్నికల్లో ఏడు స్థానాలు లభించగా, ఈసారి కేవలం మూడు స్థానాలే దక్కాయి. ఎస్సీలకు రెండు స్థానాలను మాత్రమే కేటాయించింది. ఎస్టీలకు జిల్లాలో ఒక్క స్థానం కూడా కేటాయించలేదు.
ముఖ్యనేతలను ప్రసన్నం
చేసుకునే పనిలో ఆశావహులు
కార్పొరేషన్ సహా మున్సిపాలిటీల్లో మేయర్, ఛైర్మన్, వార్డులు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు ముఖ్య నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే పోటీ చేసేందుకు ముఖ్యనేతలను సంప్రదించిన అభ్యర్థులు ఇప్పుడు రిజర్వేషన్లు ఖరారు కావడంతో తమకు అవకాశం కల్పించాలంటూ మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పార్టీలు కూడా ఎన్నికలపై కసరత్తు ప్రారంభించాయి. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాల నుంచి ఎదురయ్యే పోటీని అధిగమించి గెలుపు సాధించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ ఇతర పార్టీలు కూడా ఎన్నికల కసరత్తు ప్రారంభించాయి.
మారిపోయిన రిజర్వేషన్లు
నల్లగొండ కార్పొరేషన్‌తోపాటు మున్సిపాలిటీల్లోనూ రిజర్వేషన్లు మారిపోయాయి. తాము పోటీ చేసిన స్థానంలో అనుకూలమైన రిజర్వేషన్ కాకుండా మహిళలకు వచ్చిన స్థానాలు ఉన్నాయి. అలాంటి చోట్ల తమ సతీమణులను బరిలో నిలిపేందుకు ఆశావహులు సిద్ధం అవుతున్నారు. మరోవైపు తమకు అనుకూలమైన డివిజన్ల వేటలోనూ పడ్డారు. ఆయా స్థానాలనుంచి తాము పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు
ఫ ఉమ్మడి జిల్లాలో 18 మున్సిపాలిటీలు
ఫ 14 స్థానాలు జనరల్ కేటగిరీకి కేటాయింపు, అందులో 7 మహిళలకు
ఫ మూడుకు పడిపోయిన బీసీ స్థానాలు
ఫ ఎస్సీలకు 2 స్థానాలు, ఎస్టీలకు దక్కని ప్రాతినిధ్యం
సూర్యాపేట జిల్లాలో రిజర్వేషన్లు ఇలా..
మున్సిపాలిటీ ప్రస్తుత రిజర్వేషన్ 2020లో..
సూర్యాపేట జనరల్ జనరల్ (మహిళ)
తిరుమలగిరి జనరల్ ఎస్సీ (మహిళ)
కోదాడ జనరల్ (మహిళ) జనరల్ (మహిళ)
నేరేడుచర్ల జనరల్ ఎస్సీ
హుజూర్‌నగర్ బీసీ జనరల్ (మహిళ)


