బేగంపేటలో చిరుత జాడలు
రాజాపేట మండలం బేగంపేటలో శనివారం ఉదయం చిరుతపులి అడుగు జాడలను రైతులు గుర్తించారు.
తిరుగుప్రయాణం
సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వచ్చిన ప్రజలు తిరుగుప్రయాణం అయ్యారు.
- 8లో
ఉద్యమంలా ‘అరైవ్ – అలైవ్’
సూర్యాపేటటౌన్ : రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే నినాదంతో చేపట్టిన అరైవ్.. అలైవ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందని ఎస్పీ నరసింహ అన్నారు. శనివారం సూర్యాపేటలో ఆర్టీసీ, ఇతర వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. దేశ రక్షణలో మరణించే వారికంటే రోడ్డు ప్రమాదాల మృతులు అధికంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్ల పాత్ర కీలకమన్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే రోడ్డు ప్రమాదాలను నివారణ నివారించవచ్చన్నారు. అరైవ్.. అలైవ్ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్టీసీ డీఎం సునీత, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్‌పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


