పండుగొచ్చింది | - | Sakshi
Sakshi News home page

పండుగొచ్చింది

Jan 14 2026 7:10 AM | Updated on Jan 14 2026 7:10 AM

పండుగ

పండుగొచ్చింది

పేపర్‌ పతంగులకు ఆదరణ ఉంది

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

పల్లెగూటికి..
పిండి వంటలకు కేరాఫ్‌ తాళ్లగడ్డ
ఆనందం.. ఆరోగ్యం
హరిదాసు.. భాగ్యలక్ష్మి

30 ఏళ్లుగా ఇదే వృత్తిగా జీవనం

భానుపురి (సూర్యాపేట) : సూర్యాపేటలోని తాళ్లగడ్డ ప్రాంతం పిండివంటలకు కేరాఫ్‌గా నిలిచింది. తాళ్లగడ్డకు చెందిన శ్రీరాముల అంజమ్మ కుటుంబం 30 ఏళ్లుగా పిండి వంటలు తయారు చేస్తూ విక్రయిస్తోంది. అంజమ్మ మొదట్లో కారపూస చేసి విక్రయించేది. ఆమె చేసిన పిండి వంటలు బాగుండడంతో గిరాకీ పెరగడం ప్రారంభమైంది. దాంతో ఆమె కూడా అన్నిరకాల పిండి వంటలను తయారు చేయడం మొదలు పెట్టారు. అంజమ్మ కుమారులు, మనుమళ్లు సైతం నాలుగు దుకాణాలు ఏర్పాటు చేసి పిండి వంటలను తయారు చేసి విక్రయిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. సూర్యాపేటతో పాటు ఇతర ప్రాంతాల వారు సైతం వచ్చి తీసుకెళ్తుంటారు. కొందరు ఆర్డర్లు ఇచ్చి మరీ పిండి వంటలు చేయించి తీసుకెళ్తుంటారు. సంక్రాంతికి 10 రోజుల ముందు నుంచే గిరాకీ అధికంగా ఉంటుంది. కారపూస, సకినాలు, చెకోడీలు, బూందీ, లడ్డూలు, అరిసెలు, కట్టె గారెలు, పూర్ణాలు, గవ్వలు, మైసూర్‌పాక్‌ ఇలా అన్ని రకాల పిడి వంటలు వీరు తయారు చేసి కిలోల చొప్పున విక్రయిస్తున్నారు.

మూడు రోజులు సందడే.. సందడి

తొలిరోజు భోగి మంటలు, భోగిపండ్లు ప్రత్యేకం

రంగవల్లులతో కళకళలాడనున్న లోగిళ్లు

సూర్యాపేటటౌన్‌, రామగిరి(నల్లగొండ) : సంక్రాంతి పండుగకు చిన్నారులు, యువత పతంగులను ఉత్సాహంగా ఎగురవేస్తుంటారు. వీటిని ఎగురవేయడంలోనూ ఆరోగ్యపరమైన కారణాలతోపాటు, శాసీ్త్రయత కూడా దాగి ఉంది. పురాణాల ప్రకారం శ్రీరాముడు మకర సంక్రాంతి రోజున గాలిపటం ఎగురవేశాడని, అది ఇంద్రలోకానికి చేరిందని చెప్పుకుంటారు. అదేవిధంగా సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో ఆకాశం వైపు చూస్తూ పతంగులు ఎగురవేయడం సూర్యారాధనకు గౌరవంగా భావిస్తారు. అంతేకాకుండా పతంగులు ఎగురవేయడం వల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది. ఎముకలు బలపడతాయి. విటమిన్‌ ఈ సరఫరా పెరుగుతుంది. చలి తగ్గే సమయంలో సూర్యకిరణాలు శరీరానికి అందడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గాలిపటాలు ఎగురవేసే క్రమంలో వారు దానివైపు చూసే తీక్షణ చూపు చిన్నారుల కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇదిలా ఉండగా.. దుకాణాల్లో కొన్నవే కాకుండా కొంతమంది చిన్నారులు గాలిపటాలను వారే సొంతంగా తయారు చేసుకుంటుంటారు. చతురస్రం, దీర్ఘచతురస్రం ఆకారంలో పేపర్లను కత్తిరించుకొని అందంగా తీర్చిదిద్దుతుంటారు. దీని ద్వారా గణితంలోని జ్యామితి, ఆకారాలు వారికి తెలుస్తాయి.

సూర్యాపేటలో గంగిరెద్దును ఆడిస్తున్న

దృశ్యం

ప్రతి ధనుర్మాసంలో హరిదాసు వేషధారణ

ప్రభాత సమయంలో ప్రజలను మేల్కొలుపుతున్న మహిళ

రాజాపేట : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రానికి చెందిన అయ్యోరి మురళి గతంలో ప్రతి ధనుర్మాసంలో హరిదాసు వేషధారణతో సంకీర్తనలు, పాశురాలు పాడుతూ ప్రతి గడప ముందుకు వచ్చేవాడు. ఉదయం నాలుగు గంటల నుంచి తెల్లవారే వరకు గ్రామంలో సంచరిస్తూ తన మధురమైన గాత్రంతో ప్రజలను మేల్కొలిపేవాడు. మూడేళ్ల క్రితం ఆయన హఠాన్మరణంతో ఆ గ్రామం చిన్నబోయినట్లయింది. దాంతో తండ్రి వృత్తిని తానే స్వీకరించింది భాగ్యలక్ష్మి. ధనుర్మాసం రావడంతోటే తెల్లవారుజామున ప్రతి ఇంటికి వెళ్లి తన శ్రావ్యమైన గొంతుతో పాశురాలు, సంకీర్తనలు పాడుతూ ఇంటిల్లిపాదినీ మేల్కొలుపుతుంది భాగ్యలక్ష్మి. ఆమె సంకీర్తనలు విన్న రాజాపేట ప్రజలు ఆమె తండ్రి మురళిని గుర్తుతెచ్చుకోకుండా ఉండలేరు. మురళికి ఒక్కగానొక్క కుమార్తె అయిన రేపాక భాగ్యక్ష్మి తన తండ్రితోపాటే పాటలు, సంకీర్తనలు సంకీర్తనలు పాడుతూ తిరిగేది. తండ్రి తదనంతరం ప్రతి ధనుర్మాసంలో ఉదయంపూట గ్రామంలోని కాలనీల్లో మహిళా హరిదాసు వేషధారణతో సంచరిస్తూ తండ్రి పాడిన పాటలను మైక్‌ ద్వారా వినిపించడమే కాకుండా తన గాత్రంతో తండ్రి చదివే పద్యాలను చదువుతూ ప్రజలకు మేల్కొలపడాన్ని వృత్తిగా స్వీకరించింది. పండగ రోజుల్లో గ్రామ ప్రజలు ఇచ్చిన కానుకలను స్వీరిస్తూ వారికి ఆశీర్వచనాలు తెలియజేస్తుంది.

పురుషులకు తీసిపోకుండా పౌరోహిత్యం

మురళి కుమార్తె భాగ్యలక్ష్మి తన తండ్రి బాటలోనే నడుస్తుంది. మురళి బతికున్న రోజుల్లో శుభాకార్యాలు నిర్వహించేవాడు. అతని ఒక్కగానొక్క కుమార్తె భాగ్యలక్ష్మి తండ్రిలాగా పౌరహిత్యం నేర్చుకుంది. పురుషులకు తీసిపోకుండా చక్కటి ఉచ్చారణతో మంత్రాలు చదువుతూ వివాహాది శుభకార్యాలు, గృహప్రవేశాలు, వినాయక విగ్రహ ప్రతిష్ఠలు, సత్యనారాయణ వ్రతాలు వంటివి నిర్వహిస్తోంది. గ్రామ ప్రజలు కూడా ఆమె తండ్రిని ఆదరించినట్లే ఆమెనూ ఆదరించడం విశేషం.

60ఏళ్లుగా పతంగుల

తయారీలో ‘సాహు’ కుటుంబం

భువనగిరి: సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తుకొచ్చేది గాలిపటాలు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వీటిని ఎగురవేస్తుంటారు. ఆరుదశాబ్దాలుగా ఈ పంతంగుల తయారీనే వృత్తిగా మలుచుకుంది భువనగిరికి చెందిన ఓ కుటుంబం. పట్టణంలోని సమ్మద్‌ చౌరస్తా సమీపంలో సాహు లక్ష్మీనారాయణ కుటుంబం 1963లో ఇంట్లోనే పతంగుల తయారీకి శ్రీకారం చుట్టింది. పతంగుల తయారీలో ఎన్నోమార్పులు వచ్చినా నేటికి సంప్రదాయ రీతిలో పేపర్‌, వెదురు కర్రలతో తయారు చేసి విక్రయిస్తున్నారు. గాలిపటాల తయారీకి అవసరమైన ముడిసరుకును హైదరాబాద్‌ నుంచి తీసుకొస్తారు. ఏటా డిసెంబర్‌, జనవరి నెలల్లోనే పతంగుల సీజన్‌ వస్తుంది. దీనికోసం ఆగస్టు నుంచే పతంగులను తయారీకి శ్రీకారం చుడుతారు. నవంబర్‌కు వరకు తయారు చేసినవాటిని మార్కెట్లోకి తెస్తారు. ప్రతి సీజన్‌లో సుమారు 1,500 నుంచి రెండు వేల వరకు పతంగులను వివిధ డిజైన్లలో తయారు చేస్తారు. సీజన్‌లో పట్టణంలో నాలుగు విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో డిజైన్‌, సైజులను బట్టి ఒక్కో పతంగికి రూ.10 నుంచి రూ.50 వరకు విక్రయిస్తుంటారు.

ఎన్నో రకాల కవర్‌ పతంగులు వచ్చినప్పటికీ పేపర్‌ పతంగులకు మంచి డిమాండ్‌ ఉంటుంది. సీజన్‌కు 5 నెలల ముందు తయారు చేయడం ప్రారంభిస్తాం. ఇంట్లో అందరికీ పతంగులు తయారు చేయడం వచ్చు. ప్రస్తుతం మనవరాళ్లు కూడా తయారు చేస్తున్నారు. స్వయంగా తయారు చేసి విక్రయించడం ద్వారా కూలి డబ్బులు లాభంగా ఉంటుంది.

– లక్ష్మీనారాయణ, పతంగుల తయారీదారుడు, భువనగిరి

చిన్నారులకు జ్ఞానం

కలగాలని భోగి పండ్లు పోస్తారు

కాండూరి వెంకటాచార్యులు, గుట్ట ఆలయ ప్రధాన అర్చకుడు

యాదగిరిగుట్ట : భగవంతుడి అనుగ్రహం ఉండాలని ధనుర్మాసంలో గోదాదేవి పూజలు చేస్తుంది. ఇందులో భాగంగానే అమ్మవారు కృష్ణ పరమాత్మను అత్యంత పవిత్రంగా భావించి వర్షాలు బాగా పడాలని, ఆరోగ్యం బాగుండాలని, పంటలుబాగా పండాలని వేడుకుంటూ గోదాదేవి అమ్మవారు వ్రతాన్ని ఆచరిస్తుంది. మకరంలో సూర్యుడు సాయంత్రం 8.45గంటలకు ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో చిన్న పిల్లలకు కొత్త పంటల నుంచి వచ్చిన బియ్యం, నువ్వులు, పైసలు, రేగు పండ్లు శ్రీస్వామి వారి పాదాల వద్ద పెట్టి పిల్లల నెత్తిపై పోస్తారు. చిన్నారులకు జ్ఞానం కలుగాలని భదిరికా (రేగుపండ్లు) ఫలాలను భోగి రోజున పోస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో పశువులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే సంక్రాంతి పండుగ నుంచి ప్రారంభం అవుతుంది. మంచి వెలుతురును ఇచ్చే పండుగనే సంక్రాంతిగా జరుపుకుంటాం. ఈశ్వర తత్వం కలిగిన గోవును పూజించే సమయమే సంక్రాంతి. ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యనారాయణుడిని ధాన్యం చేస్తే చాలా బాగుంటుంది.

విశాలమైన ప్రదేశంలోనే పతంగులను ఎగురవేసేందుకు పిల్లలకు అవకాశమివ్వాలి.

దారం తెగి చెట్లు, ఇళ్లపై పడితే వారిని అక్కడకు వెళ్లనీయొద్దు.

ఎట్టి పరిస్థితుల్లో భవనాలపై గాలిపటాలు ఎగరవేయకుండా జాగ్రత్తపడాలి. చైనా మాంజా వాడకుండా చూడాలి.

విద్యుత్‌ వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లకు సమీపంలో పతంగులను ఎగురవేయొద్దు.

మూడు రోజుల పండుగ సంక్రాంతికి పల్లెలు, పట్టణాలు ముస్తాబయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునే పనిలో రైతులు.. ఇళ్ల లోగిళ్లలో రంగవల్లులు వేస్తూ యువతులు.. పిండివంటల తయారీలో మహిళలు.. గాలిపటాల ఎగురవేతలో చిన్నారులు.. ఆటల పోటీల్లో యువకులు.. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీగా మారారు. మరో పక్క బంధుమిత్రుల రాక.. కొత్త కోడళ్లు, అల్లుళ్ల సందడితో పండుగ కళ ఉట్టిపడుతోంది. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో ఊర్లన్నీ సందడిగా మారాయి. బుధవారం భోగి సందర్భంగా భోగి మంటలు వేస్తారు. చిన్నారులకు భోగి పళ్లు పోస్తారు.

పండుగొచ్చింది1
1/7

పండుగొచ్చింది

పండుగొచ్చింది2
2/7

పండుగొచ్చింది

పండుగొచ్చింది3
3/7

పండుగొచ్చింది

పండుగొచ్చింది4
4/7

పండుగొచ్చింది

పండుగొచ్చింది5
5/7

పండుగొచ్చింది

పండుగొచ్చింది6
6/7

పండుగొచ్చింది

పండుగొచ్చింది7
7/7

పండుగొచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement