ముసాయిదా జాబితాపై పలు ఫిర్యాదులను తిరస్కరించిన అధికారులు | - | Sakshi
Sakshi News home page

ముసాయిదా జాబితాపై పలు ఫిర్యాదులను తిరస్కరించిన అధికారులు

Jan 13 2026 5:40 AM | Updated on Jan 13 2026 5:40 AM

ముసాయ

ముసాయిదా జాబితాపై పలు ఫిర్యాదులను తిరస్కరించిన అధికారుల

నల్లగొండలోనే అత్యధిక ఓటర్లు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్‌ ఓటర్ల జాబితాపై వెల్లువెత్తిన అభ్యంతరాలు చాలావరకు పరిష్కారానికి నోచుకోలేదు. ఈనెల 1వ తేదీన మున్సిపాలిటీ వారీగా ప్రకటించిన ఓటర్ల ముసాయి జాబితాలపై ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. ఓటు హక్కు పక్క వార్డులో ఉందని, తాము ఉంటున్న వార్డుకు మార్చాలని, ఇంటి నంబర్లు మార్చాలంటూ అభ్యంతరాలు పలువురు వ్యక్తం చేశారు. అయితే అందులో కొన్నింటిని అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించి, పరిష్కరించారు. మరికొన్నింటిని మాత్రం తిరస్కరించారు. ఇలా జిల్లాలో ఐదు వందలకు పైగా అభ్యంతరాలు తిరస్కారానికి గురయ్యాయి. ఇక, ఉమ్మడి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో నకిరేకల్‌ మినహా మిగతా మున్సిపాలిటీల్లో ఓటర్ల లెక్కల తేలింది. 18 మున్సిపాలిటీల్లో మొత్తం 6,68,437 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు తేల్చారు. ఇందులో పురుషులు 3,23,647 మంది, మహిళలు 3,44,661 మంది ఉన్నారు. ట్రాన్స్‌జెండర్లు 129 మంది ఉన్నారు. మంగళవారం పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను, 16న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.

16న ఫొటో ఓటర్ల తుది జాబితా

ప్రస్తుతం ఓటర్ల జాబితా ప్రకటించారు. మంగళవారం పోలింగ్‌ కేంద్రాల ముసాయిదా జాబితాను ప్రకటించనున్నారు. అలాగే ఫొటోలతో కూడిన ఓటర్ల జాబి తాలను సిద్ధం చేసిన అధికారులు వాటిని కూడా ప్రదర్శించనున్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఫొటోలో కూడిన జాబితాల్లో పొరపాట్లు దొర్లితే వాటిని సరి చేసేందుకు మూడు రోజుల సమయం ఇ చ్చారు. వాటన్నింటిని సరిచేసి, ఈ నెల 16న ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాను అధికారులు మున్సిపాలిటీ వార్డుల వారిగా ప్రచురించనున్నారు.

త్వరలోనే

ఎన్నికల షెడ్యూల్‌

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్దం కావడంతో ఎన్నికల సంఘం ఫొటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా ఈ నెల 16న ప్రకటించనుంది. ఆ తరువాత ఎప్పుడైనా మున్సిపల్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈనెల 17, 18 తేదీల్లోనే షెడ్యూల్‌ రావచ్చని పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్రీదేవి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ ఎన్నికల సంసిద్ధతపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

మున్సిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు

మున్సిపాలిటీ పురుషులు మహిళలు ట్రాన్స్‌జెండర్‌ మొత్తం

నల్లగొండ 68874 73507 56 142437

మిర్యాలగూడ 45128 47878 14 93020

దేవరకొండ 11629 12200 1 23830

హాలియా 6270 6529 2 12801

నందికొండ 6475 7027 1 13503

చండూరు 5652 5717 1 11370

చిట్యాల 5930 6188 1 12118

సూర్యాపేట 52170 56664 14 108848

కోదాడ 28069 30520 12 58601

హుజూర్‌నగర్‌ 14257 15731 8 29996

నేరేడుచర్ల 6629 7116 1 13746

తిరుమలగిరి 7638 7817 0 15455

భువనగిరి 23037 24793 1 47831

చౌటుప్పల్‌ 13553 13663 0 27216

యాదగిరిగుట్ట 6760 7046 16 13822

పోచంపల్లి 7799 8028 0 15827

మోత్కూర్‌ 7106 7277 0 14383

ఆలేరు 6671 6960 1 13632

మొత్తం 323647 344661 129 668437

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే నల్లగొండలోని మున్సిపాలిటీల పరిధిలోనే అత్యధిక ఓటర్లు ఉన్నారు. నల్లగొండలో నకిరేకల్‌ మినహా మిగతా ఏడు మున్సిపాలిటీల్లో 3,09,080 మంది ఓటర్లు ఉండగా, అందులో 1,49,958 మంది పురుషులు, 1,59,046 మంది మహిళలు, 76 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

సూర్యాపేట జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 2,26,646 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 1,08,763 మంది పురుషులు, 1,17,848 మంది మహిళలు, 35 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో 1,32,711 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 64,926 మంది పురుషులు, 67,767 మంది మహిళలు, 18 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు.

ఫ 18 మున్సిపాలిటీల్లో ఓటరు

తుది జాబితా ప్రకటన

ఫ ఉమ్మడి జిల్లాలో 6,68,437 మంది మున్సిపల్‌ ఓటర్లు

ఫ నేడు ముసాయిదా పోలింగ్‌ కేంద్రాల జాబితా విడుదల

ఫ 16వ తేదీన ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితా ప్రదర్శన

ముసాయిదా జాబితాపై పలు ఫిర్యాదులను తిరస్కరించిన అధికారుల1
1/1

ముసాయిదా జాబితాపై పలు ఫిర్యాదులను తిరస్కరించిన అధికారుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement