అత్యధికంగా భూ సమస్యలపైనే..
భానుపురి (సూర్యాపేట) : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజవాణిలో వివిధ సమస్యలపై 47 అర్జీలు వచ్చాయి. వీటిలో 25 వరకు భూ సమస్యలకు సంబంధించినవి ఉండటం గమనార్హం. కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, జిల్లా అధికారులు బాధితుల నుంచి అర్జీలు స్వీకరించి వారితో మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యనిచ్చి సత్వర పరిష్కారం చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఉద్యోగి హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ఇతరులకు ఆదర్శంగా నిలువాలని పేర్కొన్నారు.ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా చూడాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
వైద్యసేవలు ఎలా ఉన్నాయి
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిని సోమవారం కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ ఎస్పీ నరసింహతో కలిసి తనిఖీ చేశారు. రోగులతో మాట్లాడి వైద్యసేవలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. మందుల స్టాక్‌ను పరిశీలించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సంక్రాంతి సందర్భంగా జాతీయ రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో వెళ్తున్నాయని, ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే వైద్యసేవలు అందించేందుకు డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
ప్రజవాణిలో 47 వినతులు
అత్యధికంగా భూ సమస్యలపైనే..


