రోడ్డు భద్రతపై ‘అరైవ్–ఎలైవ్’
సూర్యాపేటటౌన్ : రోడ్డు భద్రతపై అరైవ్ – ఎలైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఎస్పీ నరసింహ తెలిపారు. రహదారి భద్రత నియమాలు, ప్రమాదాల నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడానికి డీజీపీ శిశధర్‌రెడ్డి ప్రారంభించిన ‘అరైవ్ – ఎలైవ్’ కార్యక్రమం పోస్టర్‌ను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అరైవ్ –ఎలైవ్ ఉద్దేశం, లక్ష్యాలు ప్రతి పౌరుడికి చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. జాతీయ రహదారిపై ఉన్న సూర్యాపేట, కోదాడ మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా, మండలాల పరిధిలో గ్రామల వారీగా రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన వారిని రహదారి హీరోగా గుర్తించి, వారికి నగదు ప్రోత్సాహం అందించనున్నట్లు ఎస్పీ వెల్ల డించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, సైబర్ సెక్యూరిటీ సెల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీనారాయణ, నా గారం సీఐ నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
చైనా మాంజా అమ్మితే జైలుకే..
సూర్యాపేటటౌన్ : చైనా మాంజాలు విక్రయించినా, వినియోగించనా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ నర్సింహ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా నిఘా ఉంచామని, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది విస్త్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చైనా మాంజా అమ్ముతున్న ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలువురు బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు అందజేసి సమస్య తెలియజేశారు. ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్లకు ఫోన్‌చేసి ఫిర్యాదుదారుల వివరాలు, సమస్యను తెలియజేసి విచారణకు ఆదేశించారు. ప్రతి కేసు పారదర్శకంగా విచారణ చేయాలన్నారు.
అన్ని వర్గాల ప్రజలు
భాగస్వాములు కావాలి
ఎస్పీ నరసింహ


