క్రీడా పండుగ వచే్చస్తోంది | - | Sakshi
Sakshi News home page

క్రీడా పండుగ వచే్చస్తోంది

Jan 13 2026 5:40 AM | Updated on Jan 13 2026 5:40 AM

క్రీడ

క్రీడా పండుగ వచే్చస్తోంది

క్రీడా పండుగ వచే్చస్తోంది

సద్వినియోగం చేసుకోవాలి

చిలుకూరు: పల్లెల్లో క్రీడా సంగ్రామానికి తెరలేవనుంది. ఈ నెల 17నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు సీజన్‌ –2 సీఎం కప్‌ –2025 పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీయడమే ఈ పోటీల లక్ష్యం.

‘రూరల్‌ టు గ్లోబల్‌’ నినాదంతో..

గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు కోకొల్లలుగా ఉన్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తెచ్చేందుకు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రూరల్‌ టు గ్లోబల్‌ (గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రపంచ చాంపియన్స్‌) నినాదంతో క్రీడా పోటీలు నిర్వహిస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఐదు దశల్లో క్రీడా పోటీలు ఉంటాయి. జిల్లా స్థాయిలో 29, రాష్ట్రస్థాయిలో 44 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌(బాల,బాలికలు) విభాగాలతో పాటు ఓపెన్‌ రిక్రియేషన్‌ గేమ్స్‌ (పిల్లలు, ఇతరులు)కు ప్రాతినిథ్యం ఉంటుంది.

విజేతలకు నగదు బహుమతులు

గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తారు. జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్రస్థాయికి పంపుతారు. ఇక్కడ ప్రథమ స్థానంలో నిలిచిన జట్టుకు రూ.లక్ష, ద్వితీయ రూ.75 వేలు, తృతీయ బహుమతి కింద రూ.50 వేల నగదు పోత్సాహకం అందజేస్తారు. వ్యక్తిగత క్రీడాంశాల్లో ప్రథమ రూ.20 వేలు, ద్వితీయ రూ.15వేలు, తృతీయ రూ.10వేలు ఇస్తారు.

3,614 మంది నమోదు

హెచ్‌ఎంలు, పీడీలు, పీఈటీలు, ఉపాధ్యాయులు విద్యార్థులకు సీఎం కప్‌పై అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థులు తమ పేర్లు https:///satg. telangana. gov.in వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకుంటున్నా రు. జిల్లా వ్యాప్తంగా సోమవారం నాటికి 3,614 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం మండల కేంద్రాలు, జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నారు.

ఈ అంశాల్లో పోటీలు

అథ్లెటిక్స్‌, ఆర్చరీ, బ్యాడ్మింటన్‌, బాక్సింగ్‌, సిమ్మింగ్‌, రెజ్లింగ్‌, టేబుల్‌ టెన్నిస్‌, లాన్‌ టెన్నిస్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, జిమ్నాస్టిక్స్‌, షూటింగ్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, సెపక్‌తక్రా, చెస్‌, బేస్‌బాల్‌, నెట్‌బాల్‌, కిక్‌బాక్సింగ్‌, సైక్లింగ్‌, రోయింగ్‌, స్క్వాష్‌ రాకెట్‌, కానోయింగ్‌– కయాకింగ్‌, వుషు, అత్యపత్య, పవర్‌లిఫ్టింగ్‌, సాఫ్ట్‌బాల్‌, తైక్వాండో, స్నూకర్స్‌, జూడో, కరాటే, యోగా, స్కేటింగ్‌, ఫెన్సింగ్‌, పికిల్‌బాల్‌, సెయిలింగ్‌, బాల్‌ బ్యాడ్మింటన్‌, బాస్కెట్‌బాల్‌, హ్యాండ్‌బాల్‌, హాకీ, పుట్‌బాల్‌, మల్లకంబ్‌, పారాగేమ్స్‌, రిక్రియేషన్‌ అంశాల్లో క్రీడా పోటీలు ఉంటాయి.

17 నుంచి సీఎం కప్‌

ఐదు స్థాయిలు, 44 అంశాల్లో పోటీలు

షెడ్యూల్‌ విడుదల చేసిన అధికారులు

సీఎం కప్‌ క్రీడా పోటీలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి అవగాహన ర్యాలీలు నిర్వహిస్తాం. ఇప్పటి వరకు 3,614 దరఖాస్తులు వచ్చా యి. రాష్ట్రస్థాయికి ఎంపికై న క్రీడాకారులకు ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి. గ్రామీణ క్రీడాకారులు క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలి. –వెంకట్‌రెడ్డి, జిల్లా

యువజన, క్రీడల అభివృద్ధి అధికారి

క్రీడా పోటీల షెడ్యూల్‌..

గ్రామస్థాయి : 17 నుంచి 22

మండలం : 28నుంచి 31

నియోజకవర్గం : ఫిబ్రవరి 3నుంచి 7

జిల్లా : 10 నుంచి 14

రాష్ట్రస్థాయి : 19 నుంచి 26

(హైదరాబాద్‌లో)

క్రీడా పండుగ వచే్చస్తోంది1
1/1

క్రీడా పండుగ వచే్చస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement