ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : పోటీ పరీక్షలకు సూర్యాపేటలోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ కార్యాలయంలో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్‌పవార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు ఐదు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏదేని డిగ్రీ ఉతీర్ణులైన ఉండాలని, మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు స్టడీ సర్కిల్ డైరెక్టర్ భాస్కర్‌ను నేరుగా లేదా 8555814776, 9704752077 నంబర్లను సంప్రదించాలన్నారు.
వయోవృద్ధులకు
‘ప్రణామ్ డే కేర్ సెంటర్’
సూర్యాపేట : వృద్ధుల కోసం సూర్యాపేటలోని ఇందిరా హాస్పిటల్ వెనుకాల ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ప్రణామ్ డే కేర్ సెంటర్’ను సోమవారం జిల్లా సంక్షేమ అధికారి నరసింహరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయోభారంతో ఆత్మన్యూనతతో బాధపడుతున్న వారికి కేర్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వివిధ రకాల ఇండోర్ గేమ్స్, దినపత్రికలు, పుస్తకాలు అందుబాటులో ఉంటాయని, వీటిని సద్వినియోగం చేసుకొని మానసికోల్లాసం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సంస్థ జిల్లా చైర్మన్ ఇరిగి కోటీశ్వరి, సంస్థ సభ్యులు గుండా రమేష్, తోట శ్యాంప్రసాద్, న్యాయవాదులు రమాదేవి, డాక్టర్ దుర్గాబాయి, జె.శశిధర్, సీనియర్ సిటిజన్‌లు హమీద్‌ఖాన్, జి. విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీని కలిసిన
పోక్సో కోర్టు పీపీ
చివ్వెంల(సూర్యాపేట) : పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా నియమితులైన కోణం రఘురామయ్య సోమవారం ఎస్పీ నరసింహను కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. పోక్సో కేసుల వివరాలు, పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కేసులు వేగంగా పరిష్కారమయ్యేలా కృషి చేద్దామన్నారు.
‘గృహజ్యోతి’తో
విద్యుత్ బిల్లులు ఆదా
కోదాడరూరల్ : గృహజ్యోతి పథకంతో విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్ కామేష్ సూచించారు. డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క జారీ చేసిన గ్రీటింగ్స్‌ను సోమవారం కోదాడ మండలంలోని గుడిబండ గ్రామంలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు కూడా గృహజ్యోతి పథకానికి ధరఖాస్తు చేసుకోవాలని, తద్వారా 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పొందవచ్చన్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకం కిందికి రాని లబ్ధిదారులు కూడా విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్‌రెడ్డి, సర్పంచ్ మందుల నాగయ్య, ఏడీఈ వెంకన్న , రూరల్ ఏఈ ఎస్‌కే సైదా, ఉపసర్పంచ్ ఇర్ల జయంసింహారెడ్డి, ఇర్ల నరసింహారెడ్డి, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం


