రోడ్డు భద్రతపై అవగాహనకే ‘అరైవ్ –ఎలైవ్’
సూర్యాపేటటౌన్ : రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకే అరైవ్– ఎలైవ్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎస్పీ కె.నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో కిరాణా ఫ్యాన్సీ మర్చంట్‌హాల్‌లో నిర్వహించిన శ్రీఅరైవ్ – ఎలైవ్‌శ్రీ (సురక్షిత గమ్యం –సజీవ ప్రయాణం) కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పౌరులు బాధ్యతగా ఉండడం, ప్రయాణ సమయంలో సురక్షిత గమ్యాలను చేరుకోవడం లక్ష్యంగా డీజీపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామం, కాలనీ, మండలంలో పోలీసులు, పౌరుల భాగస్వామ్యంతో నిర్వహిస్తామన్నారు. రోడ్డు భద్రతపై పౌరులకు విస్తృత అవగాహన కల్పించి ప్రమాదాల నివారణ కోసం కృషి చేస్తామన్నారు. అనంతరం రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లు, విద్యార్థులు, పౌరులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఆర్టీఓ జయప్రకాశ్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ఆర్టీసీ డీఎం సునీత, జిల్లా ఆస్పత్రి ఆర్‌ఎంఓ గీతావాణి పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


