ప్రజలకు మాజీ మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు
సూర్యాపేటటౌన్ : మకర సంక్రాంతి ప్రజల జీవితాల్లో మరి న్ని వెలుగులు నింపాలని, వారంతా సుఖ శాంతులతో జీవించాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని, భోగిమంటలు, పతంగులు ఎగురవేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
మట్టపల్లికి త్వరలో
గవర్నర్ జిష్ణ్ణుదేవ్‌వర్మ
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ త్వరలో సందర్శించనున్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మట్ట పల్లి క్షేత్రాన్ని సందర్శించారు. గవర్నర్‌రాక సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి త్వరలో రానున్నారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతిని ఆదేశించారు. గ్రామ పంచాయతీ పరిధిలో రోడ్లు, కాలువలు, కృష్ణానదీ పరీవాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సర్పంచ్ రామిశెట్టి విజయశాంతికి సూచించారు. అగ్నిమాపక, విద్యుత్, వైద్యశాఖ, పోలీస్‌శాఖ అధికారులు చేపట్టాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలిచ్చారు. అంతకు ముందు కలెక్టర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ శ్రీనివాసులు, ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్‌లు అనూష, రవితేజ, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ చరమందరాజు, తాహసీల్దార్ మంగారాథోడ్, ఎస్‌ఐ పి.బాబు ఉన్నారు.
టీచర్లకు టెట్ నుంచి
మినహాయింపు ఇవ్వాలి
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలోని ప్రభుత్వ సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత పొందే విషయంలో మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సంఘం జిల్లా కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులకు టెట్ అర్హత మార్కులను తగ్గించాలని సూచించారు. 2023 జూలై నుంచి అమలు కావాల్సిన నూతన పీఆర్సీ రిపోర్టును వెంటనే తెప్పించి అమలు చేయాలన్నారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్‌కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె. యాకయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కోశాధికారి జి.వెంకటయ్య, జిల్లా కార్యదర్శిలు ఎన్.నాగేశ్వరరావు, వి.రమేశ్, సీహెచ్.రమేశ్ పాల్గొన్నారు.
ప్రజలకు మాజీ మంత్రి సంక్రాంతి శుభాకాంక్షలు


