క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్
సూర్యాపేటటౌన్ : గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నదని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా యువజన సర్వీసులు, క్రీడా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఎస్పీ నరసింహతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సంతోష్‌బాబు చౌరస్తా మీదుగా సద్దుల చెరువు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు క్రీడాకారులకు అవకాశం కల్పించడమే ఈ పోటీల ఉద్దేశం అన్నారు. శాలు కల్పించడమమేనని తెలిపారు. సీఎం కప్ పోటీలు 44 క్రీడాంశాల్లో సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామ స్థాయిలో ఈ నెల 17 నుంచి 22 వరకు, మండల స్థాయిలో ఈ నెల 28 నుంచి 31 వరకు, నియోజకవర్గ స్థాయిలో ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు, రాష్ట్ర స్థాయిల్లో ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఎస్పీ నర సింహ మాట్లాడుతూ సీఎం కప్ క్రీడల్లో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించడం ద్వారా రాష్ట్ర స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎస్‌ఓ వెంకటరెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, డీఎల్‌పీఓ నారాయణరెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ బాలకృష్ణ, ఎంఈఓ శ్రీనివాస్, పీఈటీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
జాన్‌పహాడ్ ఉర్సుకు పకడ్బందీ ఏర్పాట్లు
పాలకవీడు : ఈ నెల 22, 23, 24 తేదీల్లో జరగనున్న జాపహాడ్ దర్గా ఉర్సు ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయనున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. మంగళవారం ఆయన దర్గా సమీపంలో వివిధ శాఖల అధికారులతో సమావేశమై ఉర్సు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా దర్గా వద్ద భక్తులు పడుతున్న ఇబ్బందులను ప్రజలు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దర్గా వద్ద అపరిశుభ్రత, నిర్వాహకుల అవినీతిపై ఉప సర్పంచ్ నాగరాజు ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఉర్సుకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో భక్తులకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ధరల పట్టికను ప్రదర్శిచాలన్నారు. వాహనాల పార్కింగ్‌కు అనువైన స్థలాలను గుర్తించి శుభ్రం చేయించాలన్నారు. మూడు రోజులపాటు నిరంతరం విద్యుత్ సరఫరా కొనసాగించాలని సూచించారు. క్యూలైన్ల కోసం బారికేడ్లు ఏర్పాటు చేయాలని, వక్ఫ్‌బోర్డు అధికారులు వివిధ శాఖల అధికారులను సమన్వయపరచుకోవాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీని వాసులు, జెడ్పీ సీఈఓ శిరీష, డిప్యూటీ కలెక్టర్లు అనూష, రవితేజ, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ కమలాకర్, సీఐ చరమందరాజు, మాజీ ఎంపీపీ భూక్యా గోపాల్, అధికారులు పాల్గొన్నారు.
ఫ టార్చ్ ర్యాలీ ప్రారంభంలో
కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


