నేరేడుచర్ల: క్షయ వ్యాధిని నియంత్రించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కోటాచలం అన్నారు. శనివారరం నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ప్రధాన మంత్రి టీబీ ముక్తి భారత్ అభియాన్, విక్షయ మిత్ర ఆధ్వర్యంలో పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు. భారతి గంగ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ సొసైటీ సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకే పౌష్టికాహారం కిట్లు అందజేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో వైద్యాధికారులు, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నజియా మాట్లాడుతూ క్షయ బాధితులకు పౌష్టికాహారం కిట్లు ఎంతో ఉపయోగపడుతున్నాయ న్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జయ మనోరి, పీహెచ్‌సీ వైద్యాధికారులు పున్నా నాగిని, బ్రౌజ్, విక్షయ మిత్ర వ్యవస్థాపపక అధ్యక్షుడు వెంకట శ్రీధర్, వలంటీర్లు అనంద్‌కుమార్, మట్ట శ్రీనివాస్, సీహెచ్‌ఓ శ్రీనివాస్, సూపర్‌వైజర్లు వెంకటేశ్వర్లు, ధనమ్మ, నర్సయ్య, హరిసాగర్, ఆశాలు సునిత, తులసి, జానకమ్మ పాల్గొన్నారు.
ఫ డీఎంహెచ్‌ఓ కోటాచలం


