సూర్యాపేట టౌన్: దివ్యాంగులకు ఇచ్చే ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ కె.అశోక్ అన్నారు. బుదవారం సూర్యాపేటలోని జెడ్పీ బాలుర పాఠశాలలో సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 147 దివ్యాంగ విద్యార్థులకు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమ్మిళిత విద్యా సమన్వయకర్త యర్రంశెట్టి రాంబాబు, హెచ్‌ఎం గోలి పద్మ, విశ్వజ్ఞాచారి తదితరులు పాల్గొన్నారు.
డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా చేయాలి
హుజూర్‌నగర్: ప్రస్తుత వేసవిలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాలని జిల్లా ప్రత్యేకాధికారి, చీఫ్ ఇంజనీర్ ఏ.కామేష్ అన్నారు. బుధవారం హుజూర్‌నగర్‌లోని టీచర్స్ కాలనీలోని విద్యుత్ ఓవర్ లోడ్ ట్రాన్‌ఫార్మర్లను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. విద్యుత్ అధికారులకు, సిబ్బందికి ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఈ ఫ్రాంక్లిన్, డీఈ వెంకట కిష్టయ్య, ఏడీఈ నాగిరెడ్డి, ఏఈ రాంప్రసాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎండిన పొలాలకు పరిహారం ఇవ్వాలి
మోతె: ఎండిన వరి పొలాలకు ప్రభుత్వమే ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు, లాల్‌తండా, బళ్లుతండా, బీక్యతండాలో ఎండిన వరిపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం నీళ్లు విడుదల చేయకపోవడాన్ని ఖండిస్తూ రైతులతో కలిసి ఎస్సారెస్పీ కాల్వలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది కాంగ్రెస్ తెలచ్చిన కరువని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శీలం సైదులు,నాయకులు ఏలూరి వెంకటేశ్వరరావు,నూకల యుగంధర్‌రెడ్డి, కారింగుల శ్రీనివాస్‌గౌడ్, గుండాల గంగులు, జానిపాషా, ముత్తయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
తెగుళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి : డీఏఓ
హుజూర్‌నగర్ రూరల్: తెగుళ్ల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండి, వ్యవసాయాధికారులు సలహాలు, సూచనలు పాటిస్తూ అవసమైన మందులు పిచికారీ చేయాలని డీఏఓ శ్రీధర్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ మండలంలోని వివిధ గ్రామాల్లో అగ్గితెగులు, కాండం తొలుచు పురుగు తెగుళ్లు సోకిన పంటపొలాలను ఏఓ రావిరాల స్వర్ణతో కలిసి ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏఈఓ ముస్తాఫా, ప్రణయ్ పలువురు రైతులు ఉన్నారు.
ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి
ఉపకరణాలను సద్వినియోగం చేసుకోవాలి